Thummi Mokka మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. చాలా మొక్కలలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ మొక్కల గురించి వివరించారు. అయితే అన్ని మొక్కల గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఈ క్రమంలోనే అలాంటి మొక్కల్లో తుమ్మి మొక్క ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దీన్ని పలు రకాల ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. తుమ్మి మొక్క మన ఇంట్లో ఉంటే ఎలాంటి రోగాలు రావని చెబుతుంటారు.
వర్షాకాలంలో మనకు తుమ్మి మొక్కలు బాగా కనిపిస్తాయి. వీటిని తెచ్చి ఇంటి పెరట్లో లేదా ఇంటి ముందు కుండీల్లోనూ పెంచుకోవచ్చు. ఈ మొక్క ఆకులు మనకు బాగా ఉపయోగపడతాయి. తుమ్మి ఆకులను కూరగా వండుకుని తింటుంటారు. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. తుమ్మి ఆకులను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. పక్షవాత వ్యాధిని సైతం నయం చేసే శక్తి తుమ్మి ఆకులకు ఉందని ఆయుర్వేదం చెబుతోంది.
తుమ్మి ఆకులను బాగా నలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ మిశ్రమాన్ని తేలు కుట్టిన చోట వేసి కట్టుకట్టాలి. దీంతో విషం హరించుకుపోతుంది. గాయం సులభంగా నయమవుతుంది. అలాగే రెండు టీస్పూన్ల మోతాదులో తుమ్మి ఆకుల రసాన్ని తాగిస్తే శరీరంపై విష ప్రభావం పడదు. ఇక గాయాలు, పుండ్లపై కూడా తుమ్మి ఆకులను పేస్ట్‌లా చేసి రాసి కట్టు కడితే అవి త్వరగా మానిపోతాయి.
నెలసరి సమయంలో మహిళలకు కొందరికి అధికంగా రక్తస్రావం కావడంతోపాటు నొప్పులు కూడా ఉంటాయి. అలాంటి వారు రెండు తుమ్మి ఆకులను బాగా నలిపి అందులో కొద్దిగా నిమ్మరసం, నువ్వుల నూనె వేసి కలిపి తినాలి. దీంతో ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే పాము కుట్టిన చోట కూడా తుమ్మి ఆకులను వేసి కట్టుకడితే ఫలితం ఉంటుంది. పాము కుట్టిన వారికి కూడా తుమ్మి ఆకుల రసాన్ని తాగించాలి. దీంతో విషం ప్రభావం చూపించకుండా కాపాడవచ్చు.
తుమ్మి ఆకుల రసాన్ని ఒక టీస్పూన్ మోతాదులో ఉదయం, సాయంత్రం తాగుతుంటే ఎంతటి తీవ్ర జ్వరం అయినా సరే వెంటనే తగ్గిపోతుంది. అలాగే గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు పై పూతగా తుమ్మి ఆకుల మిశ్రమాన్ని రాయాలి. దీంతో ఆయా సమస్యలు తగ్గుతాయి. అలాగే వాపులకు, నొప్పులకు కూడా తుమ్మి ఆకులు పనిచేస్తాయి.
ఇక తుమ్మి ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలిస్తుండాలి. దీంతో నోట్లో పూత, పుండ్లు తగ్గుతాయి. నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. నోరు, దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
జీర్ణ సమస్యలకు కూడా తుమ్మి ఆకులు బాగానే పనిచేస్తాయి. తుమ్మి ఆకులను కూరగా వండుకుని తింటే అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, కడుపునొప్పి తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. లివర్, కిడ్నీలు, జీర్ణవ్యవస్థ శుభ్రంగా మారుతాయి.
తుమ్మి ఆకుల రసాన్ని రెండు చుక్కల చొప్పున ఒక్కో ముక్కు రంధ్రంలోనూ వేయాలి. దీంతో సైనస్ సమస్య తగ్గుతుంది. ఆస్తమా, జలుబు, ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస సమస్యలు ఉండవు. కనుక ఇన్ని లాభాలను ఇచ్చే తుమ్మి మొక్క మీకు ఎక్కడ కనిపించినా వదలకుండా ఇంటికి తెచ్చుకుని పెంచుకోండి. అనారోగ్యాల నుంచి సురక్షితంగా ఉండండి.