Noni Fruit: తొగరు పండ్లు పేరు ఎప్పుడైనా ఉన్నారా. కరోనా తర్వాత కాలం నుంచి ఈ పండ్లకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ పండ్లు వాడి 100 పైన రోగాలు తగ్గించుకోవచ్చు. ఈ పండ్లలో 150 పైన పోషక విలువలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో తొగరు పండ్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి.
తొగరు పండు, ఆకులు, కొమ్మలు అని వాటిని ఔషధాలో వాడుతారు. ఈ తొగరు పండ్లతో క్యాన్సర్లో 10 రకాలు తగ్గించువచ్చు. కరోనా తర్వాత ప్రజల్లో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి తొగరు పండ్ల జ్యూస్ తాగుతున్నారు. ఈ తొగరు జ్యూస్ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ జ్యూస్ రోజు తాగడం ద్వారా మన రోగ నిరోధక శక్తి బలంగా అవుతుంది.
తొగరు పండ్లలో యాంటీ ఒబేసిటీ పోషకాలు ఉన్నాయి. ఈ పండ్లు లేదా జ్యూస్ తాగడం ద్వారా సులువుగా బరువు తగ్గడం జరుగుతుంది.
ఊబకాయం సమస్యతో బాధ పడుతున్న వాళ్ళు ఈ జ్యూస్ తాగడం ద్వారా చాలా రోగాలని తగ్గించుకోవచ్చు. ఊబకాయం ఉంటే ప్రతి రోగాని మన శరీరంలోకి స్వాగతించవచ్చు. ఈ ఊబకాయంని తగ్గించుకోవడాని ప్రతి రోజు ఈ తొగరు పండ్ల జ్యూస్ తాగడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది.
Also Read: Pashu Kisan Credit Card: పశు క్రెడిట్ కార్డు స్కీం రైతులు ఎలా వాడుకోవాలి.!
తొగరు జ్యూస్ తాగడం వల్ల ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన శరీరంలో చెక్కర స్థాయిని తగ్గిస్తుంది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు ఈ పండ్లు లేదా జ్యూస్ తాగితే షుగర్ వ్యాధిని కంట్రోల్ అవుతుంది.
ఈ పండ్లలో బీటా గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉండటం వల్ల 10 రకాల కాన్సర్ వైద్య మందులో వాడుతారు. కాన్సర్ వచ్చిన వాళ్ళు ఈ జ్యూస్ తాగితే ఆ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.
కిడ్నీ సంబంధిత రోగులు కూడా ఈ జ్యూస్ తాగితే వారి సమస్యలు తగ్గిపోతాయి. ఈ పండ్లని హై బీపీ మందుల తయారిలో కూడా వాడుతారు. కంపెనీ వాళ్ళు రైతులతో కాంట్రాక్టు పెట్టుకొని ఈ పండ్ల పంటని పండిస్తున్నారు. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ పండ్లు మార్కెట్లో కూడా మంచి ధరకి అమ్ముతున్నారు.
Also Read: Dry Leaves Fodder: ఎండు ఆకులతో పశుమేత తయారీ.!