ఆరోగ్యం / జీవన విధానం

Asparagus Benefits: వేసవి కాలంలో మంచి ఆరోగ్యం మీ సొంతం కావాలనుకుంటే ఇది తప్పక తినాల్సిందే!

4
Asparagus
Asparagus

Asparagus Benefits: ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఆహారానిది ముఖ్యపాత్ర. ఆరోగ్యకరమైన ఆహారాలలో ఆకుకూరలు మరియు కూరగాయలు ప్రధానమైనవి. అందులో ఒకటే ఈ ఆస్పరాగస్. ఇది ఒక రుచికరమైన వసంతకాలపు కూరగాయ, దీనికి ఈ పేరు గ్రీకు పదం “ఆస్పరాగోస్” నుండి వచ్చింది, దీని అర్థం “స్ప్రింగ్”. శీతాకాలం ముగిసిన తర్వాత వచ్చే మొదటి ఆకుపచ్చ కూరగాయలలో ఇది ఒకటి, ఇది దీని రుచికి ప్రసిద్ధి చెందింది. వేసవి కాలంలో తినదగిన కూరగాయల్లో ఇది ఒకటి. ఆస్పరాగస్ లో మన ఆరోగ్యానికి కావాల్సిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఈ ఆస్పరాగస్, తెలుపు మరియు ఊదాతో సహా వివిధ రంగులలో లభిస్తుంది. దీన్ని తరచుగా పాస్తాలో మరియు ఇతర వేపుళ్లలో జోడించుకొని తింటారు. ఆస్పరాగస్ ని ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, శ్వాస తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

Asparagus Benefits

Asparagus Benefits

అర కప్పు (90 గ్రాములు) వండిన ఆస్పరాగస్‌లో: కేలరీలు: 20, ప్రోటీన్: 2.2 గ్రాములు, కొవ్వు: 0.2 గ్రాములు, ఫైబర్: 1.8 గ్రాములు, విటమిన్ సి: RDIలో 12%, విటమిన్ A: RDIలో 18%, విటమిన్ K: RDIలో 57%, ఫోలేట్: RDIలో 34%, పొటాషియం: RDIలో 6%, భాస్వరం: RDIలో 5%, విటమిన్ E: RDIలో 7% లభిస్తాయి. అలాగే ఆస్పరాగస్‌లో ఇనుము, జింక్ మరియు రైబోఫ్లావిన్‌లతో సహా ఇతర సూక్ష్మపోషకాలు కూడా తక్కువ మొత్తంలో లభిస్తాయి. రక్తం గడ్డకట్టడానికి మరియు ఎముకల ఆరోగ్యానికి అవసరమయ్యే విటమిన్ K ఇందులో లభిస్తుంది. ఆస్పరాగస్‌లో లభించే అధిక ఫోలేట్ కంటెంట్, ఆరోగ్యకరమైన గర్భధారణకు, కణాల పెరుగుదలకు మరియు DNA నిర్మాణంతో సహా శరీరంలోని అనేక ముఖ్యమైన ప్రక్రియలకు తోడ్పతుంది. బరువు తగ్గాలనుకునే వారు వారి ఆహారంలో ఆస్పరాగస్ ను తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆస్పరాగస్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. ఇది మహిళల్లో మరియు పురుషుల్లో సంతానోత్పత్తికి కూడా తోడ్పడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.

Also Read: Sugarcane Internode Borer: చెరుకును ఆశించు పీక పురుగు యాజమాన్యం పద్ధతులు.!

Asparagus

Asparagus

గర్భధారణ సమయంలో మహిళలకు ఫోలేట్ అనేది చాలా అవసరం అది ఈ ఆస్పరాగస్ లో పుష్కలంగా లభిస్తుంది. మూత్రనాళ సమస్యలను నివారించడంలో కూడా ఆస్పరాగస్ కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో లభించే విటమిన్ E కారణంగా రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఆస్పరాగస్ అద్భుతంగా పని చేస్తుంది. ఆస్పరాగస్ మీ మానసిక స్థితిని మెరుగుపరచడంలో కూడా ప్రయోజకరంగా పని చేస్తుంది. అలాగే ఆహరం సక్రమంగా జీర్ణం కావడానికి మరియు ఆహార నాళ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా ఇది అద్భుతంగా పని చేస్తుంది.

Also Read: Summer Foods: వేసవికాలంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలు

Leave Your Comments

Sugarcane Internode Borer: చెరుకును ఆశించు పీక పురుగు యాజమాన్యం పద్ధతులు.!

Previous article

 Grambharati Kisan Expo 2023: గ్రామభారతి కిసాన్ ఎక్స్‌పో 2023 కి స్వాగతం

Next article

You may also like