Teasle Gourd Cultivation: మనం ప్రతినిత్యం అనేక రకాల కూరగాయలను ఆహారంలో తీసుకుంటాము. వీటన్నిటిలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. అలాంటి కూరగాయల్లో ఆకాకర కాయ ఒకటి. చూడటానికి ఆకుపచ్చని రంగులో గుండ్రంగా, బొడిపెలతో ఉండే ఆకాకర కాయల్నే బోడ కాకర అని కూడా పిలుస్తుంటారు. కాకరకాయను పోలి వుండే ఆకాకర పోషకాల గని కూడా. ఇవి అడవుల్లో ఎక్కువగా దొరుకుతుంటాయి. దీన్ని ఎక్కువగా ఆంధ్ర, అస్సామీ, గుజరాతీ, ఒడిషా, మహారాష్ట్ర వంటకాలలో వాడతారు. కాకరకాయతో పోల్చితే చేదు తక్కువగా ఉంటుంది. ఇక ఈ రకం కాకర గురించి తెలిసిన వాళ్లు రేటు గురించి అస్సలు ఆలోచించరు . ఇవి అటవీ ప్రాంతంలో పండుతాయి కాబట్టే వీటికి అంత రేటు.
ఆకాకరకాయ ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో కేలరీలు తక్కువగా ఉండటంతో పాటు పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇంకా ఆకాకర ప్రయోజనాలు ఏంటో చూద్దాం..
Teasle Gourd Benefits:
- ఆకాకర ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది.
- గర్భిణులకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది. దీనిలో ఉండే ఫొలేట్‌లు శరీరంలో కొత్త కణాల వృద్ధికీ, గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది. గర్భిణులు రెండు పూటలా భోజనంలో ఈ కూరను తీసుకోవడం వల్ల దాదాపు వందగ్రాముల ఫొలేట్ అందుతుంది.
- మధుమేహంతో బాధపడే వారికి ఆ కాకరకాయ ఎంతో మేలు చేస్తుంది. రక్తంలో ఇన్సులిన్ స్థాయిల్ని పెంచుతుంది. చక్కెర శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది. దీనిలో ఉండే ఫైటో న్యూట్రియంట్లు కాలేయం, కండరాల కణజాలానికి బలాన్ని చేకూరుస్తాయి.
- శరీరంలో ఏర్పడే కాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి.
- ఇందులో ఉండే సి విటమిన్ శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది.
- దీనిలో లభించే విటమిన్ ‘ఎ’ కంటి చూపుకు మేలు చేస్తుంది.
- మూత్రపిండాల సమస్యలున్న వారికి ఇది ఒక ఔషధంలా పని చేస్తుంది.
- ఆకాకరను తరచుగా ఆహారంలో తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, ఇతర అలెర్జీలు దూరం అవుతాయి
Also Read: హైడెన్సిటీ విధానంలో తైవాన్ జామ సాగు.. అధిక లాభాలు
అకాకర సాగు చేసే రైతులు విత్తనాన్ని సొంతంగా తయారు చేసుకుంటారు. Teasle Gourd Cultivation అయితే విత్తనాలను ఒక పొలంలో పండిన తర్వాత అదే పొలంలో మరోసారి నాటరు. ఒక పొలంలో పండిన పంట నుంచి విత్తనాలు అదే పొలంలో విత్తితే పంట సరిగా పండదని చెప్తున్నారు రైతులు. ఈ పంటకు ఎక్కువగా ఖర్చు అయ్యేది పందిరి వేసేందుకే. మొక్కలు పందిరికి ఎంత బాగా అల్లుకుంటే అంత అధిక దిగుబడి వస్తుంది. అధిక దిగుబడి రావాలంటే ముందు అధిక పెట్టుబడి పెట్టాల్సిందే. ఆకాకరకు కూడా ఇది వర్తిస్తుంది. దీని సాగుకు ఎకరానికి సుమారు లక్ష నుంచి 1.20 లక్షల వరకూ ఖర్చు చేస్తారు రైతులు. ఒక్క పందరి వేసేందుకే రూ.40 నుంచి 55 వేల వరకూ ఖర్చు చేస్తారట. ఈ పంట వృద్ధి కాలం పంట వేసిన 100 రోజులకు దిగుబడులు ప్రారంభమవుతుంది. వారానికి ఒకసారి కాయలను కోస్తారు. ఆరునెలలు పాటు నిరంతరాయంగా దిగుబడులు వస్తాయి. ఎకరానికి సగటున మూడు టన్నుల వరకూ దిగుబడి లభిస్తుంది. పరిస్థితులు అనుకూలిస్తే అత్యధికంగా 4.5 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని రైతులు చెప్తున్న మాట.
Also Read: జీవన ఎరువుల వాడకం వలన అధిక ప్రయోజనాలు..