Tamarind Seed Benefits: సరిగ్గా వాడుకుంటే మన వంటిల్లే ఓ ఆయుర్వేదిక్ ఆసుపత్రిగా మార్చేయవచ్చు. మనం రోజు వినియోగించే పదార్థాలు, ఆహార వస్తువులు మనకు తెలియకుండానే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంటాయి. రుచికి పులుపు, తియ్యగా ఉండే చింతపండులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చింత పండులో ఉండే టార్టారిక్ యాసిడ్ ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. అయితే చింతపండు వల్ల మాత్రమే కాకుండా చింత గింజ వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ- రూర్కీ బయోటెక్నాలజీ ప్రొఫెసర్లు రూపొందించిన ఓ నివేదిక ప్రకారం.. చింతపండు గింజలు మన ఆరోగ్యానికి చాలారకాలుగా మేలు చేస్తాయని తేలింది.
- చింత పండు గింజల్లో పొటాషియం ఉంటుంది. అది హైబీపీ, ఇంకా ఇతర కార్డియో వాస్యులర్ డిసీజెస్ తో బాధపడే వారికి ఉపశమనం కలిగిస్తుంది.
- చింత గింజల మిశ్రమంతో కీళ్ల నొప్పులే కాదు డయేరియా, చర్మంపై దురదలు, దంత సంబంధ సమస్యలు, అజీర్ణం, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం, దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్లు, డయాబెటిస్, గుండె సంబంధ వ్యాధులకు చక్కని ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. ఎముకలు విరిగితే ఆ ప్రదేశంపై రోజు చింతగింజల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
- ఈ గింజలను పొడిగా చేసి అందులో నీళ్లు కలిపి ముద్దలా చేసుకుని రోజూ దంతాలను తోముకోవాలి. దీంతో దంతాలు తెల్లగా మారుతాయి. దంతాలపై ఉండే గార, పాచి సైతం తొలగిపోతుంది.
Also Read: అల్లం పంట సాగు – ఉపయోగాలు
- వయస్సు మీద పడిన మహిళలకు చింత గింజలు ఎంతో మేలు చేస్తాయి. నిజానికి ఆడవారికి వయసు మళ్ళిన తర్వాత శరీరంలో క్యాల్షియం తగ్గుతూ ఉంటుంది కనుక వీటిని ఉపయోగిస్తే ఎముకల బలహీనత తగ్గుతుంది.
- బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు దీనిని క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కొవ్వు కరిగిపోతుంది. చింత గింజలు వేపుకుని కూడా తినొచ్చు. అలాగే వీటిని పొడి చేసుకుని కూడా ఉపయోగించ వచ్చు.
- చింత గింజల పొడి డికాషన్‌ను తాగడం వల్ల హైబీపీ సైతం తగ్గుతుంది. ఈ గింజల్లో ఉండే పొటాషియం బీపీని తగ్గిస్తుంది.
Also Read: విశాఖ కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు..బహు బాగు