Sundakkai Health Benefits: సుందక్కాయి… ఈ పేరు ఎప్పుడైనా విన్నారా… ఈ సుందక్కాయి ఎక్కువగా తమిళనాడు ప్రాంతాల్లో ఎక్కువగా కూరాయగలగా వాడుతారు. కరోనా తర్వాత మన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలలో కూడా దొరుకుతున్నాయి. సుందక్కాయికి చాలా పేర్లు ఉన్నాయి. వీటిని ఉస్తికాయ , ఉడిగిచెట్టు, అడవి వంకాయ, బాటని వంకాయ, బ్యూటీ బెర్రీ, టర్కీ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఈ సుందక్కాయి కరోనా కాలం నుంచి బాగా డిమాండ్, అందుబాటులోకి వచ్చింది.
ఈ సుందక్కాయి చెట్టుని ఎలాంటి ప్రదేశంలో అయిన పెంచుకోవచ్చు. ఎలాంటి మట్టిలో అయిన కూడా పెరుగుతుంది. నీటి వినియోగం కూడా చాలా తక్కువ. ఈ చెట్టు 5-6 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ చెట్లని ఇంటి పెరటిలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. ఈ చెట్టు వంకాయ మొక్కల ఉంటుంది. వీటికి ముళ్ళు కూడా ఉంటాయి.
Also Read: Check Tray Management: చెరువులో చెక్ ట్రే టేబుల్ వీటిలో నిర్మిస్తే పెట్టుబడి చాలా వరకు తగ్గుతుంది..
ఈ సుందక్కాయి తింటే దాదాపు 100 విటమిన్ సి టాబ్లెట్స్ తిన్నట్టు. ఈ సుందక్కాయి చేదుగా ఉంటుంది. ఈ కాయని పగలగొట్టి లోపల ఉండే గిజలతో వంటలు చేసుకోవచ్చు. ఈ గింజలతో పప్పు చేసుకుంటారు ఎక్కువగా. ఈ సుందక్కాయిని ఎక్కువగా పప్పు, పచ్చడ్లు, ఊరగాయలు కూడా తయారు చేస్తారు.
సుందక్కాయి రక్తం తక్కువగా ఉన్న వాళ్ళు, అనేమియా ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది. వీటి ద్వారా ఇమ్మ్యూనిటి కూడా పెరుగుతుంది. కిడ్నీ సంబంధిత రోగాలు తగ్గుతాయి. కాన్సర్ రోగంలో కణాల పెరుగుదల కూడా తగ్గిస్తుంది. ఇప్పుడు అమెజాన్, ఆన్లైన్ ద్వారా కూడా సుందక్కాయి అమ్ముతున్నారు. వీటిని ఎండా పెట్టి కూడా అమ్ముతున్నారు. సుందక్కాయి పండించి ఇతర రాష్ట్రాలకి కూడా ఎగుమతి చేస్తున్నారు.
Also Read: Agricultural Mobile App for Farmers: రైతులు ఈ అప్ ద్వారా ఉచితంగా చాలా లాభాలు పొందవచ్చు.!