Star Fruit Health Benefits: స్టార్ ఫ్రూట్ ను కారాంబోలా అని కూడా పిలుస్తారు, అవెర్రోవా కారాంబోలా అనే పేరు గల చెట్టుకి కాస్తుంది.ఇది భారతదేశం, మలేషియా, ఇండోనేషియా మరియు ఫిలిప్పీన్స్ లలో ఉండే ఉష్ణమండల ప్రాంతాలలో ఎక్కువగా పండిస్తారు. ఈ పండు పక్వానికి వచ్చినప్పుడు ముదురు ఆకుపచ్చ రంగును కలిగి ఉంటుంది, కానీ పూర్తిగా పండినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. పండిన స్టార్ ఫ్రూట్ కండను కలిగి రసబరితంగా, తీపి మరియు పులుపు రుచిని కలిగి ఉంటుంది. ఈ పండుని క్షితిజ సమాంతరంగా ముక్కలుగా కోసినప్పుడు, నక్షత్రాన్ని పోలి ఉంటుంది, అందుకే దీనికి “స్టార్ ఫ్రూట్” అని పేర్కొంటారు.
స్టార్ ఫ్రూట్ పోషక విలువలు : స్టార్ ఫ్రూట్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉండటం, విటమిన్లు, ఇతర పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు అధిక పరిమాణంలో ఉండటం వలన ఆరోగ్యానికి మంచిది.ఇందులో ఫైబర్,ప్రొటీన్,విటమిన్ సి,విటమిన్ B5,కాల్షియం, సోడియం, ఫోలేట్, రాగి,పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ విరివిగా ఉంటాయి.
Also Read: Elephant Foot Yam: కందగడ్డ సాగు విధానం మరియు సస్యరక్షణ
స్టార్ ఫ్రూట్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు: క్యాన్సర్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది. స్టార్ ఫ్రూట్ క్యాన్సర్ నివారణకు పనిచేస్తుంది.దీనికి చాలా పరిశోధనలు జరిగి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. పండులోని పీచు శరీరంలోని విష పదార్థాల స్థాయిలను తగ్గించి, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని దూరం పెట్టవచ్చు. ఈ పండులోని అధిక స్థాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు సోరియాసిస్ మరియు డెర్మటైటిస్ తగ్గించి, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పని చేస్తాయి. స్టార్ ఫ్రూట్‌లో ఉండే అధిక పీచు జీవక్రియలను పెంచడం వలన బరువు తగ్గడానికి సహాయ పడుతుంది. అలాగే, తక్కువ కేలరీలు ఉన్నందున బరువు పెరగడం గురించిన చింత లేకుండా స్టార్ ఫ్రూట్ రుచిని ఆస్వాదించవచ్చు. స్టార్ ఫ్రూట్ లో విటమిన్ సి ఉండడం వలన శరీరం బలమైన రోగనిరోధక వ్యవస్థను పెంపొందించి కావాల్సిన స్థాయిలో తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది.
శ్వాసకోశ ఆరోగ్యం మెరుగుపరచడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ సామర్థ్యం ఉన్నందున, ఈ పండు గొంతు నొప్పిని తగ్గిస్తుంది. దీని రసం శ్లేష్మం మరియు కఫం తగ్గిస్తుంది, అందువలన దీనిని శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌ల చికిత్స చేయడానికి మరియు గుండె ఆరోగ్యం మెరుగుపరుస్తుంది స్టార్ ఫ్రూట్‌లోని అధిక మొత్తంలో సోడియం మరియు పొటాషియం ఉండడం వలన శరీరం పనిచేయుట కావాల్సిన ఎలక్ట్రోలైట్‌లుగా పనిచేస్తాయి,ఇది అధిక రక్తపోటును తగ్గిస్తుంది. హృదయ ఆరోగ్యం, స్పందన మరియు రక్త ప్రవాహాన్ని సరిన స్థాయిలో ఉంచుతుంది.
స్టార్ ఫ్రూట్‌లో ఉండే కాల్షియం రక్తనాళాలు మరియు ధమనులపై ఒత్తిడిని తగ్గించడం వలన గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. స్టార్ ఫ్రూట్‌లోని పీచు మలం యొక్క కదలికను సులభతరం చేయడం వలన మలబద్ధకం, ఉబ్బరం, తిమ్మిరి మరియు విరేచనాలను తగ్గిస్తుంది. కిడ్నీ సమస్యలతో బాధ పడేవారు ఈ పండును తినే ముందు వైద్యుడి సలహా తీసుకోవాలి.
Also Read: Kitchen Garden: కిచెన్ గార్డెన్ యొక్క ప్రయోజనాలు