Potato Side Effects: ఈరోజుల్లో బంగాళాదుంప లేకుండా కూరగాయాలని ఉహించుకొలేము. ఇది చాలా మందికి ఫేవరేట్ కూడా. బంగాళాదుంపతో చేసే ఆహార పదార్థాల రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే కొందరు రోజూ తింటుంటారు. బంగాళాదుంపలను సరైన పరిమాణంలో తింటే అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగాళాదుంపలో అనేక ముఖ్యమైన పోషకాలకు పెట్టింది పేరు. ఇందులో పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ సి, మెగ్నీషియం, జింక్ మరియు ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
అయితే ఆలులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని ఆరోగ్య సంబంధిత పరిస్థితులలో దీనిని నివారించాలి. కొన్నిసార్లు కొంతమందికి బంగాళాదుంపలను పరిమాణంలో తినడం మంచిది. ఇవి బరువును పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలాగే ఉడికించిన బంగాళదుంపలు కూడా బరువు పెరగడానికి కారణం కావచ్చు. మీరు బంగాళాదుంపలను ఇష్టంగా తినాలని ఉన్నప్పటికీ తక్కువ పరిమాణంలో తినడం మేలు.
బంగాళదుంపలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. రాత్రి భోజనంలో బంగాళదుంపలతో చేసిన వాటిని తినడం మంచిది కాదని, ఈ సమయంలో గ్యాస్ లేదా అసిడిటీని మరింత పెంచుతుందని అంటున్నారు. బంగాళాదుంపలను ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల కొంతమందికి కడుపు ఉబ్బరం సమస్యలు కూడా వస్తాయి.
చక్కెర మధుమేహ రోగులకు ఆలు ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఉండే నేచురల్ షుగర్ శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేస్తుంది. ఇది డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు డాక్టర్ లేదా నిపుణుల సలహా మేరకు బంగాళదుంపలను తక్కువ పరిమాణంలో తీసుకోవచ్చు.