Reu Plant Benefits: ఇది దాదాపు 75 సెం.మీ. నుండి 1 మీ. ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. దీని ఆకులు కణుపుకు ఒకటి చొప్పున వస్తాయి. ఆకులు సంయుక్తం. కాడ పొట్టిగా ఉంటుంది. పత్రాలు కోలగా, చివరిలో గుండ్రంగా ఉండి మందంగా ఉంటాయి. ఆకులను నలిపితే ఒకరకమైన ఘాటు వాసన వస్తుంది. పుష్పాలు పసుపు రంగులో గుత్తులుగా కొమ్మల చివర వస్తాయి. కాయలు చిన్న కాడతో గుండ్రంగా ఉండి గట్టి పెంకుతో ఐదు భాగాలు కలిగి ఉంటాయి. గింజ నల్లగా కోణం కలిగి ఉంటుంది.
వ్యవసాయరంగంలో ఉపయోగాలు: సదాపాకు మిథనాల్ ద్రావణం క్యూలెక్స్ పైపియెన్స్ పై గొప్ప ప్రభావం చూపుతుంది. 85.53% లార్వాలను చంపుతుంది. గుడ్లు పొదగడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.సదాపాకు ఆకులు, వాటినుండి వేరు చేసిన రసాయనాలను రైస్వీవిల్, సైటోఫిలస్ ఒరైజే పెద్ద పురుగులపై ఫ్యూమిగెంట్ మరియు కాంటాక్ట్ విష చర్యపద్ధతులలో పరీక్షిస్తారు. ఫ్యూమిగెంట్ పద్ధతిలో మిథనాల్ ద్రావణం క్లోరోఫాం ఫ్రాక్షన్ 87.7% సైటోఫిలస్ ఒరైజే పెద్ద పురుగులను చంపుతుంది. రెండు పద్ధతులలో క్వినోలిన్, క్వినోలిన్-4 -కార్బాల్డిహైడ్, క్వినోలిన్-3-కార్భాల్డిహైడ్ విష ప్రభావం చూపుతుంది.సదాపాకు నుండి వేరు చేసిన ఎసెన్షియల్ ఆయిల్ మెడిటెర్రేనియన్ , సెరాటైటిస్ కాపిటేటపై కీటకనాశక చర్యను ప్రదర్శిస్తుంది.
సదాపాకు ద్రావణం సల్టెర్రేనియన్ చెదపురుగులు, సామ్మోటెర్మెస్ హైబోస్టోమ నుండి కాపాడుతుంది.
Also Read: Gooseberry Plants: ఉసిరిలో కనిపించే వ్యాధులు
సదాపాకు ఆకుల ఇథనాల్ ద్రావణం స్పోడోప్టెరా లిట్టొరాలిస్ లార్వాలపై లార్విసైడల్ మరియు యాంటీ ఫీడెంట్ చర్యలను ప్రదర్శిస్తుంది.సదాపాకు ఆకుపొడి (5 గ్రా. / 25 గ్రా. గింజలు) వరి ధాన్యం నిల్వలో ఆశించే సైటోఫిలస్ ఒరైజెని 100% చంపుతుంది. అసిటోన్ ద్రావణం 3 రోజుల తర్వాత 100% పెద్ద పురుగులను చంపుతుంది.
ఔషధ రంగంలో సదాపాకు ఆకులు మరియు తైలములను ఔషధాలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఆకుల నుండి లభించే తైలము మరియు రూటిన్ అనబడు రసాయనం అనేక వ్యాధులకు వాడుతున్నారు.కొన్ని ప్రాంతాల్లో దీని ఆకుల రసం తీసి చెవి పోటు తగ్గించుటకు సైటోపింగ్ ఉపయోగిస్తారు.
తెలంగాణ ప్రాంతములో దీని ఆకులను ముఖ్యంగా చిన్న ఆసిదోని పిల్లలకు వచ్చే జలుబు, గొంతునొప్పి, కడుపులో పురుగులను 1000 గారించుటకు ఉపయోగిస్తారు. తైలమును ఉత్తేజ ప్రేరితముగా మరియు లకు సంబంధించిన రోగాలను నయం చేయుటకు వాడతారు.
-Rakesh Jhadi
Ph.D. Research Scholar
Department of Agronomy
Bidhan Chandra Krishi Viswavidhyalaya
Contact no:9505410171
Also Read: Pineapple Health Benefits: పైన్ ఆపిల్ తినడం వల్ల కలిగే లాభాలు.!
Must Watch: