ఆరోగ్యం / జీవన విధానం

Preparation of Juice and Squash: జ్యూస్ మరియు స్క్యాష్ తయారీ.!

0
Preparation of Juice
Preparation of Juice

Preparation of Juice and Squash: సాధారణంగా జ్యూస్ మరియు స్క్యాష్ ఏదైనా బాగా రసాన్నిచే పండ్లతో తయారు చేస్తారు. రాసాన్ని బాగా తీసి ఏమాత్రం పిప్పి లేకుండా వడబోసి తయారు చేసేది జ్యూస్. పండ్ల రసం వడబోయకుండా తయారు చేస్తే దానిని స్క్యాష్ అంటారు. ఇది ఒకటి తప్ప తయారీలో ఏమార్పు ఉండదు.

బత్తాయి స్క్యాష్ తయారీ
బాగా పండిన ఆరోగ్యకరం అయినా బత్తాయి పండు ను తీసుకొని కడిగిన తర్వాత వాటిని రెండు సమా భాగాలుగా కోసి గింజలు తీసివేయాలి. తర్వాత వీటినుంచి గాజు లేదా స్టీల్ తో తయారు చేయబడిన రసం తీయు పరికరంతో రసం తీయాలి.ఇలా తీసిన రసం లో పిప్పి కూడా ఉండును.రసం తూకం వేసి ఉపయోగించిన పండ్ల రకం బట్టి 50 గ్రా.1కేజీ పంచదార కలపవచ్చు.సుమారు 160 సే. గ్రే.వరకు వేడి చేయాలి.తర్వాత ఈ మిశ్రమం నిల్వ ఉంచుటకు పోటాషియం మేటబైసల్ఫేట్ సోడియం బెంజోయేట్ కలిపి తర్వాత శుద్ధి చేసిన సీసా లో స్క్యాష్ పోసి నిల్వ చేయవచ్చు.

Preparation of Juice and Squash

Preparation of Juice and Squash

Also Read: Amla juice health benefits:ఉసిరి రసం తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

లైమ్ కార్డియల్ తయారీ
కావాల్సిన పదార్థాలు
నిమ్మ రసం 1.0 లీ
పంచదార 1.25లీ
నీరు 1.0లీ
కేమ్‌ స్ 2.0 లీ

పండిన నిమ్మకాయల నుండి కార్డియల్ తయారు చేయవచ్చు.

ఈ తయారీ కి గాను ఆరోగ్యం గా ఉండి బాగా పండిన నిమ్మకాయలను ఎంపిక చేసుకున్న తర్వాత వాటిని నీటిలో బాగా కడగాలి.

తర్వాత పండును సరిగా సగంకు కోసి గింజలు తీయాలి.

పండు నుంచి రసం తీసి ప్రతి కేజీ రసానికి 1 గ్రా. పోటాషియం బై సల్ఫేట్ కలపాలి.పొడుగు గాజు సీసా లో లేదా పింగని జాడిలో కానీ నింపి సుమారు 5 వారల వరకు రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి.

పండు పిప్పి భాగం సీసా అడుగున చేరి పైన స్వచ్ఛమైన రసం ఏర్పడును.ఈ రాసాన్ని వేరే పాత్రలోకి నింపుకోవాలి.

ఇంకా ఏమైనా పిప్పి ఉన్న రాసాన్ని మళ్ళీ కొన్ని రోజుల వరకు రిఫ్రిజిరేటర్ ఉంచి తర్వాత వాడపోసుకోవలి.

ఇలా తయారు చేసిన కార్డియల్ ను పంచదార మరియు నీటిని కలిపి ఉపయోగిస్తారు.

పండ్ల రసం లో పిప్పి భాగం త్వరగా విడిపోవడానికి జిలాటిన్ అనే పదార్ధాలను కలిపి నిల్వ చేస్తే 2-3 వారలోనే కార్డియల్ తయారు అవుతుంది.

Also Read: Sugarcane Juice Benefits: ఒక గ్లాస్ చెక్కర రసం.. లాభాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ?

Leave Your Comments

Chawki Rearing Practices: చాకీ పురుగులు ఎలా పెంచాలి.!

Previous article

Dairy Animals: పాడి పశువుల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.!

Next article

You may also like