ఆరోగ్యం / జీవన విధానం

వేసవిలో శరీరాన్ని చల్లబరిచే సోంపు డ్రింక్ తయారీ.. ప్రయోజనాలు

0

ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. భానుడు భగభగ మండుతూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక దాహం కూడా ఓ రేంజ్ లో వేస్తుంది. మరోవైపు ఎండనుంచి వచ్చిన శరీరం చల్లదనాన్ని కోరుకుంటుంది. డీహైడ్రేషన్ ఏర్పడితే సహజంగా కూల్ డ్రింక్ వైపు దృష్టిసారిస్తారు. అయితే కృత్రిమమైన డ్రింక్స్ బదులు సహజసిద్ధంగా తయారు చేసుకునే పానీయాలు తీసుకుంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎంతో మంచిది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా.. ఈ రోజు వేసవి దాహార్తిని తీర్చే సోంపు గింజలతో డ్రింక్ తయారీ విధానం, ఉపయోగాలు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్థాలు:
సోంపు గింజల పొడి – పావు కప్పు, నీళ్లు – రెండు కప్పులు, పటిక బెల్లం రుచికి సరిపడా, నిమ్మ రసం కొంచెం, నల్లరంగు కిస్మిస్ ఒక స్పూన్.

తయారీ విధానం:
ముందుగా సోంపు గింజల పొడిని నీటిలో 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. అదే సమయంలో నల్ల కిస్మిస్ లను కూడా నీటిలో నానబెట్టాలి. మూడు గంటల తర్వాత సోంపు గింజల పొడి నీటిని వడకట్టి దానిని ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత నల్ల కిస్మిస్ ను మెత్తగా చేసుకుని ఆ సోంపు నీటిలో కలపాలి. ఆ మిశ్రమంలో పటిక బెల్లం, నిమ్మరసం కలుపుకోవాలి. తర్వాత టెస్ట్ కు సరిపడే నీరు వేసుకోవాలి అంతే సోంపు గింజల డ్రింక్ తయారవుతుంది.
ఉపయోగాలు:
ఈ సోంపు గింజల డ్రింక్ ను వేసవిలో రోజూ తాగితే వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరం చల్లగా ఉంటుంది. వేసవిలో ఉష్ణోగ్రతల నుంచి రక్షణ లభిస్తుంది. డీహైడ్రేషన్ బారినపడకుండా ఉంటారు. శరీరంలో వ్యర్థాలు బయటకు పోతాయి. అధిక బరువు తగ్గవచ్చు. అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

Leave Your Comments

ఉత్తమ ఫలితాలిచ్చిన కొత్త రకం వేరుశనగ

Previous article

2.5 ఎకరాల కౌలు భూమిలో 46 రకాల వరి వంగడాల సాగు..

Next article

You may also like