ఆరోగ్యం / జీవన విధానం

పచ్చని పొదరింట్లో చుట్టూ పాజిటివిటీ..

0

మనసు ఎంత ఆందోళనలో ఉన్నా పచ్చని మొక్కలను చూస్తే చాలు నిమిషాల్లో ప్రశాంతత లభిస్తుంది. అంతేకాదు పచ్చని పొదరింట్లో చుట్టూ పాజిటివిటీ ఉంటుంది. ఆ మొక్కల్లో రకరకాలు. ఒక్కో మొక్క, ఇంట్లోని ఒక్కో రూమ్ కి సెట్ అవుతుందని నిపుణులు అంటున్నారు.
పీస్ లిల్లీ:
ఈ మొక్కకు తడి తక్కువ వెలుతురు వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఈ లిల్లీలు ఇంట్లోని కొద్దిపాటి స్థలంలోనే అపరిమితమైన అందాన్ని ఇస్తాయి. ముదురు ఆకుపచ్చ మొక్క మధ్య తెల్లటి పూలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. పైగా ఈ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయి.
బోస్టన్ ఫెర్న్:
ఈ మొక్కలను ఎక్కువగా బాత్ రూమ్ లో పెట్టుకుంటారు. చాలా మొండి మొక్కగా దీనికి పేరు. ఎంతటి తేమనైనా తట్టుకోగలదు. వీటిని కిటికీ పక్కన హ్యాంగింగ్ కుండీల్లో పెట్టుకోవచ్చు. బాత్ టబ్ లేదా ఇంటి ఎంట్రన్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు.
స్పైడర్ ప్లాంట్:
ఈ మొక్కను చంపడం చాలా కష్టమైన పని. కానీ నిర్వహణ మాత్రం చాలా సులభం. ఇది చుట్టూ ఉన్న గాలిని స్వచ్చంగా మారుస్తుంది. ఇంట్లోని పెంపుడు జంతువులకు కూడా ఈ స్పైడర్ ప్లాంట్ వల్ల హాని జరుగదు.
పోతోస్ :
ఎవర్ గ్రీన్ పోతోస్ ను ఇంట్లో వేలాడే కుండీల్లో పెట్టుకోవచ్చు. అలాగే గది మూలన కుండీల్లోనూ పెంచుకోవచ్చు. వీటిని వాష్ బేసిన్ కౌంటర్ల దగ్గర వేజ్ లేదా గాజు సీసాల్లోనూ పెట్టొచ్చు. ఈ మొక్కలు ఎలాంటి వాతావరణం లోనైనా బతుకుతాయి. నాటిన కొద్దిరోజులకే ఆరోగ్యంగా ఏనుకుంటాయి కూడా.

Leave Your Comments

వానాకాలం సాగుకు తయారువుదాం ఇలా..

Previous article

ప్రతి రైతు తన ఇంట అరుదైన ఉత్తమ పశు సంపద..

Next article

You may also like