Pongamia Pinnata Uses: కానుగ చెట్టు బెట్టను తట్టుకుంటుంది. చెట్టు మధ్యస్థంగా ఉండి 18 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 1.5 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 1.5 అడుగుల చుట్టుకొలత ఉండి, బెరడు. పలుచగా, మృదువుగా బూడిద రంగు కలిగి ఉంటుంది. ఆకులు రాలుతాయి ఆకులు అభిముఖంగా 5-9 జతలుగా ఉంది కోడిగుడ్డు ఆకారాన్ని పోలి ఉంటాయి. పూలు గులాబీ లేదా వంగ రంగుల్లో పూస్తాయి. కాయ దీర్ఘ చతురస్రాకారంగా మందంగా ఉంటుంది. రక్షణ పత్రాలు గిన్నె ఆకారంలో, ఆకర్షక పత్రాలు ఎరుపు రంగులో ఉంటాయి. కాయలు 4.0-7.5 సెం.మీ., పొడవు మరియు 1.7-3.2 సెం.మీ వెడల్పు ఉంటాయి. కాయల్లో 1 లేక 2 విత్తనాలు ముడుచుకుని ఉంటాయి. విత్తనాలు ఎరుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి. గింజ 1.7-2.0 సెం.మీ పొడవు మరియు 1.2-1.8 సెం.మీ., వెడల్పు ఉంటుంది.
Also Read: PJTSAU: పిజెటిఎస్ ఎయూలో ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ అగ్రికల్చర్ కార్యక్రమం.!
ఉపయోగాలు:
కానుగను తోటల్లో అలంకరణ కొరకు మరియు రోడ్లకు ఇర్రెవైపుల నీడ కొరకు మరియు సువాసన కలిగిన పువ్వుల కొరకు పెంచుతారు.
ఎండిన పువ్వులు, ఆకులను మొక్కలకు ఎరువుగా ఉపయోగించవచ్చు. చెట్టు బెరడుతో తాళ్ళు. తయారు చేయవచ్చును. చెట్టు బెరడు నుండి తీసిన నల్లని జిగురు విషపూరితమైన చేపల వలన కలిగే గాయాలకు మందుగా ఉపయోగించవచ్చు.
ఎండిన ఆకులను వేసి పురుగుల బారి నుండి కాపార్శ్యకోవచ్చు. ఆకులను పచ్చి రొట్టలా వాడి నులి పురుగులను నివారించవచ్చు. ఆకులను పశువుల మేతగా వాడవచ్చు.
కానుగ నూనెను క్రిమి సంహారిణిగా ఉపయోగించవచ్చు. (బాసిల్లస్ ఆంత్రసిస్, బా. పులిలస్, ఈ.కోలై, సూడోమోనాస్ మాంజిఫెరా, సాల్మొనెల్లా టైఫి, సార్సినా లుటియా, స్టెఫైలోకోకస్ ఆల్బస్, స్టెఫైలోకోకస్ ఆరియస్, జాన్తోమొనాస్ కాంపస్ట్రీస్).
కలప గట్టితనాన్ని కలిగి ఉండుట వలన బండి చక్రాల, ఫర్నిచర్ తయారికి, ఇంధనంగా, వంట చెఱకుగా ఉపయోగపడుతుంది.
విత్తనంలో నూనెను తీసిన తరువాత మిగిలిన చెక్కను ఎరువుగా వాడవచ్చు. చెక్కను కోళ్ళ దాణాలో కలిపి కోళ్ళకు ఆహారంగా కూడా ఉపయోగించవచ్చు.
కానుగ నూనె చేదుగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. గింజల్లో వంటకు పనికి రాని నూనె 27% ఉంటుంది. దీనిని సబ్బులు వార్నిష్, రంగుల తయారీలో, దీపాలను వెలిగించడానికి, మరియు కందనంగా ఉపయోగిస్తారు. చర్మవ్యాధుల నివారణిగా కూడా ఉపయోగిస్తారు.
ఆకుల నుండి తీసిన పెసరను జలుబు, దగ్గు, డయోరియా, అజీర్ణం, కడుపుబ్బరం, కుష్టు, శగ రోగాలకు మందుగా ఉపయోగిస్తారు. వేర్లలో చిగుర్లు, పళ్ళు శుభ్రపరుస్తారు. పొడి చేసిన గింజలను జ్వరానికి, కోరింత దగ్గుకి ఉపయోగిస్తారు. పువ్వులను మధుమోహానికి, బెరడును బెరి-బెరికి మూలశంకకు ఉపయోగిస్తారు.
ఆయుర్వేదంలో బూడిదను ఆరోగ్యమైన పళ్ళ కొరకు, చెవి నొప్పికి, చాతి నొప్పికి, వరిబీజము, నడుమునొప్పికి ఉపయోగిస్తారు. నూనెను జ్వరానికి, చర్మవ్యాధులకు మందుగా ఉపయోగిస్తారు.