ఆరోగ్యం / జీవన విధానం

ఆక్సిజన్ ని అందించే మొక్కలు..

0

కరోనా విరుచుకుపడుతుంది. దీనికి ఒక్కటే మార్గం స్వీయ రక్షణ. అలాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం. గాలి, వెలుతురు ధారాళంగా ఉండేలా చూసుకోవడం. అందుకోసం ప్రత్యేకమైన మొక్కలన్ని మన ఇంటి ఆవరణలో పెంచుకోవాలి. ఇవి స్వచ్ఛమైన గాలిని ఇవ్వడంతోపాటు ఇంటికి కొత్త కలనిస్తుంది.
ఈ విపత్కర పరిస్థితుల్లో తెల్లారితే చాలు ఆక్సిజన్ కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కరోనా రోగులను చూస్తూనే ఉన్నాం. ఆక్సిజన్ కొరత వల్ల రోగులు చనిపోయిన వార్తలు కూడా ప్రతిరోజూ వినాల్సిన దుస్థితి ఏర్పడింది. అయితే ప్రకృతి సిద్ధమైన ఈ మొక్కల్ని మన ఇంట్లో పెట్టుకుంటే ఇక మన ఇంట్లో ఆక్సిజన్ కు కొరత ఉండదు. స్వచ్ఛమైన గాలి కోసం ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మనం ఉన్న చోటే పచ్చని మొక్కను పెంచితే అదే మనకు ప్రాణవాయువును ఇస్తుంది. అసలే ఎండాకాలం ఇంట్లో వేడి కూడా పెరుగుతూనే ఉంటుంది.
గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గుముఖం పడుతుంది. ఇప్పుడు దీన్ని పరిష్కరించే దిశగా మనం ఇళ్లలో ఆక్సిజన్ అందించే మొక్కలని పెంచుకోవాలి. ఈ మొక్కలు బోలెడంత ఆక్సిజన్ ను గాలిలోకి వదిలి, గదిలోని వేడిని పీల్చుకుంటాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల్లో ఈ మొక్కలు ఎక్కువగా లభిస్తున్నాయి. సాధారణంగా ఈ మొక్కల ధరలు రూ. 50 నుంచి రూ. 500 పలుకుతున్నాయి. ఎంచక్కా ఇంట్లోనే వీటిని పెంచుకోవచ్చు. వీటికి ఎక్కువ నీరు కూడా అవసరం ఉండదు. కానీ, మనకు కావాల్సిన ఆక్సిజన్ ను అందిస్తాయి. గాలిలో ఉన్న కార్బన్ డై ఆక్సయిడ్ ఉంటోందా అన్నది తేలాల్సిన ప్రశ్న. వేడి వల్ల ఒక్కోసారి ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో మనకు గాలి ఆడని ఫీలింగ్ కలుగుతుంది. కరోనా ఎఫెక్ట్ తో ఇప్పటికే చాలా మంది పెరటి గార్డెన్ ను పెంచుతున్నారు. అదేవిధంగా ఇటువంటి ఆక్సిజన్ అందించే, ఎయిర్ ప్యూరీఫైయర్ మొక్కల్ని కూడా ఇంటి వరండాలో, గార్డెన్ లో పెంచుకోవడానికి తీసుకెళ్తున్నారు. ఇవి అందంగా ఉండటమే కాక ఆరోగ్యాన్ని పెంచుతున్నాయని అంటున్నారు. పగలైనా, రాత్రైనా అవి ఆక్సిజన్ నే విడుదల చేస్తాయి. ముఖ్యంగా మనీ ప్లాంట్ అంటారే అది 24 గంటలూ ఆక్సిజన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. దేశంలో కరోనా వల్ల అందరికీ ఆక్సిజన్ ప్రయోజనాలపై అవగాహన కలుగుతోంది. అలాగే ఆక్సిజన్ మొక్కలపైనా సదభిప్రాయం ఏర్పడుతుంది. అలాంటి వారంతా ఈ మొక్కలు తీసుకెళ్తున్నారు.
మనీ ప్లాంట్, స్నేక్ ప్లాంట్, రబ్బర్ ప్లాంట్, స్పైడర్ ప్లాంట్, ఫిడిల్ లీఫ్, అరేకా పామ్ మొక్క, క్రేస్ స్యూలా, అలోవెరా మొక్కలు ఆక్సిజన్ ను అందిస్తాయి.

Leave Your Comments

విత్తనం కొనుగోలులో రైతులు తస్మాత్ జాగ్రత్త..

Previous article

బ్లాక్ రైస్ గుణాలు.. ప్రాధాన్యత

Next article

You may also like