PALM JAGGERY: మనం తినే అహరపదార్థాల్లో రుచిని ఆస్వాదిస్తూ తినేవాటిలో ముఖ్యంగా చెప్పుకునేవి తీపి పదార్థాలే. అయితే అవి కూడా కృత్రిమంగా తయారు చేసినవి కాకుండా ప్రకృతి సిద్ధంగా దొరికేవి అయితే ఆరోగ్యానికి మంచిది. అయితే తాటి బెల్లం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది. ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి రుచి మాత్రమే మిగిలి , ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు. ప్రస్తుతం ప్రజలకు పెరుగుతున్న అవగాహన వలన మళ్ళీ పూర్వపు వంటకాల వైపు మళ్లడం ఒక ఆరోగ్యకరమైన పరిణామం.అలాగే చెరుకు బెల్లం లో అధిక గంధక స్థాయిలను కలిగి ఉండడం తీవ్ర అనారోగ్యానికి దారి తీయవచ్చు.
పూర్వం తీపి పిండివంటల తయారీకి చేరుకుగడలతో చేసే బెల్లం లాగానే తాటి బెల్లంని కూడా ఎక్కువగా వాడేవారు. కానీ తరువాతి కాలంలో దాని వాడకం కనుమరుగయ్యి మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తుంది.బెల్లం ధరలు కూడా పెరగడంతో ప్రత్యామ్న్యాయాలు కూడా వెతుకుతున్న పరిస్థితుల్లో ఇది మంచి ఆదరణ పొందుతుంది.ఇది ప్రస్తుతానికి పాత ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఎక్కువగా రోడ్ల పక్కన గంపలలో పెట్టి అమ్మడం చూడవచ్చు.దీనితో అరకు లోయలో ప్రత్యేకమైన హల్వా కూడా చేస్తారు.
Also Read: చెఱకు నుండి బెల్లం తయారీలో మెళకువలు
తాటి బెల్లాన్ని ఎలా తీస్తారు ?
తాటిచెట్టు నుండి తీసిన లేతరసాన్ని పాకం పట్టడం వల్ల తాటి బెల్లం తయారు అవుతుంది. తాటి బెల్లాన్ని పొడిగా అయ్యేంత వరకు కాస్తే తాటి కలకండ వస్తుంది.దానినే పామ్ షుగర్(తాటి చెక్కర ) అంటారు. దీన్ని సున్నపు కల్లుతో వండుతారు. ఇది కొంచెం వాసనతో, కాస్త వగరుగా ,తియ్యగా ఉంటుంది.
తాటి బెల్లంలో గల పోషక విలువలు, ఉపయోగాలు
★ తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది .ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, ఆస్తమా ని తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. ఇందులో ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, పొటాషియం, మరియు భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.
★ తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది.
తాటి బెల్లం లో ఫైబర్ల (పీచు పదార్థాలు) ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్స్ మలబద్ధకం మరియు అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.తాటి బెల్లం లో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అనీమియా(రక్తహీనత)సమస్యను నివారిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. స్త్రీలలో బహిష్టు సమస్యలను అరికడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తాన్ని శుద్ధి చేసి శరీరంలో దెబ్బతిన్న కణజాలాల్ని పునరుద్ధరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలో వేడిని తొలగిస్తుంది.
Also Read: తాటిముంజుల ఆరోగ్య ప్రయోజనాలు..