ఆరోగ్యం / జీవన విధానం

గోంగూరలో పోషకాలు మెండు

0

ఆకుకూరల్లో కొవ్వు తక్కువ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫోలిక్ ఆమ్లం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఫైటోకెమికల్స్ అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని 11 శాతం తగ్గిస్తుంది. వీటిలో విటమిన్ కె, మెగ్నీషియం, కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలను నిర్మించే ఆస్టియోకాల్సిన్ ఉత్పత్తి అవుతుంది. రోజు ఆకుకూరలు తింటున్న మధ్య వయస్కులైన మహిళలు హిప్ ఫ్రాక్చర్ ప్రమాదాన్ని 45 శాతం మేర తగ్గుతుంది.
ఆకుకూరల్లో ఉండే రిచ్ బీటా కెరోటిన్, విటమిన్ ఎ, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. విటమిన్ ఎ తగినంతగా తీసుకోని పిల్లలకు అంధులు అయ్యే ప్రమాదం వుంది.
ఆకుకూరల్లో కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ చాలా రకాల క్యాన్సర్లు నుండి రక్షిస్తాయి. అందువల్ల రోజువారీ ఆహారంలో ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

Leave Your Comments

బంగ్లాపై షేడ్ నెట్ లో వివిధ రకాల సాగు..

Previous article

ఎరువుల రూపంలో రైతులపై భారం..

Next article

You may also like