ప్రతి పండ్ల మార్కెట్లో తనిఖీలు చేపట్టాలి – మంత్రి తుమ్మల

ఈ మామిడి సీజన్లో మామిడికాయలు త్వరగా పక్వానికి రావడానికి కార్బైడ్ వాడకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీ సురేంద్రమోహన్ గారితో ఫోన్ లో మాట్లాడిన మంత్రిగారు, మార్కెట్ యార్డులలో కార్బైడ్ ను ఎవరు వాడకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్బైడ్ వాడకంతో ప్రజలకు ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయని మంత్రిగారు తెలియజేశారు.
మంత్రిగారు ఇచ్చిన ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి డిప్యూటి డైరెక్టర్ శ్రీ ప్రసాద్ రావుగారు, ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ శ్రీమతి రాజేశ్వరి మరియు వారి సిబ్బందితో కలిసి ఈ రోజు మార్కెటింగ్ అధికారులు జాంబాగ్, బాటసింగారం పండ్ల మార్కెట్లను సందర్శించి, తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా మోతాదుకు మించి ఎథోఫోన్ ఎథిలిన్ ప్యాకెట్లను పండ్ల పక్వం కోసం ఉపయోగిస్తున్నట్టు గుర్తించి, వాటిని సీజ్ చేసి ఐపిఎం పరిశీలనకోసం పంపించడం జరిగింది. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రిగారు ఈ సందర్భంగా తెలియజేశారు.
Leave Your Comments