Kiwi Healthy Drink: రోగనిరోధక శక్తిని పెంచే కివీ స్మూతీ. పెరుగుతున్న వేడిని దృష్టిలో ఉంచుకుని శరీరానికి అవసరమయ్యే ఆహార పదార్ధాలను ఎంచుకోవాల్సి అవసరముంది. ఈ రోజు మేము మీకు కివీ స్మూతీ యొక్క సులభమైన వంటకాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నిజానికి కివీ పండు మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పండ్లలో కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు ఈ పండును తింటే ఎంతో మేలు. విటమిన్ సీతోపాటూ ఇందులో విటమిన్ K, E ఉంటాయి. అలాగే ఆరోగ్యాన్ని కాపాడే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. మన చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్స్… కివీ పండులో బాగా ఉంటాయి. అందువల్ల సూర్యరశ్మి, వాయు కాలుష్యం, పొగ వల్ల చర్మం పాడవకుండా ఉండేందుకు కివీ బాగా పనిచేస్తుంది. మంచి నిద్ర అనేది శరీరాన్ని అలాగే మనసును ప్రశాంతపరుస్తుంది. నిద్రపట్టక ఇబ్బంది పడుతున్నవారు కివి ఫ్రూట్స్ ను తింటే ప్రాబ్లెమ్ సాల్వవుతుంది.
కివి స్మూతీ కోసం కావలసినవి:
1 కప్పు కివి
1/2 కప్పు అరటి
1 స్పూన్ వెనిలా ఎసెన్స్
1 స్పూన్ తేనె
2 టేబుల్ స్పూన్ల పాలు
కివీ స్మూతీని ఎలా తయారు చేయాలి:
ముందుగా కివీ, అరటిపండు చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్ జార్‌లో అన్ని పదార్థాలు, పాలు మరియు వెనీలా ఎసెన్స్ వేసి పేస్ట్ చేయండి. ఒక గ్లాసులో స్మూతీని తీసి అందులో తేనె కలపండి. ఇంకేముందు నోరూరించే మరియు సమ్మర్ స్పెషల్ కివి-వనిల్లా స్మూతీ రెడీ. ఈ స్మూతీని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతారు.