Lemon Health Benefits: నిమ్మలో ఎక్కువగా విటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతి రోజు గోరు వెచ్చని నీటితో పాటు లెమన్ జ్యూస్ ను తీసుకోవడం అలవాటు చేసుకుంటే రోజు అంత హుషారుగా ఉండవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా దీన్ని తరచు తీసుకోవడం వల్ల శరీరంలో ఏర్పడ్డ మాలినలు తొలగించుకోవచ్చు. అలాగే లెమన్ జ్యూస్ వల్ల మన జీర్ణ క్రియ సులువుగా చేస్తుంది. మూత్ర పిండలో రాళ్ళు కూడా లేకుండా చేయడానికి ఈ నిమ్మ కాయ ఎంతో ఉపయోగపడుతుంది.
లెమన్ లో అద్భుతమైన సౌందర్య రహస్యం కూడా ఉంది. ఇది ముఖాన్ని కంతి వంతగా మారుస్తుంది.ఇందులో విటమిన్ సి,బి, క్యాల్షియం , మెగ్నీషియం, పోటాషియం మరియు ఫైబర్ దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ప్రతి రోజు లెమన్ ను మో చేయి మరియు మోకాళ్లు కు రుద్దితే నలుపు రంగు పోతుంది.
Also Read: Benefits of Lemon Juice: వేసవిలో నిమ్మకాయ రసం తీసుకోవడం వల్ల ప్రయోజనాలు
లెమన్ జ్యూస్ లో దూదిని ముంచి ఆ రాసాన్ని కంటి క్రింద మరియు ముఖానికి మసాజ్ లా రాయడం వల్ల ముఖం పై నల్లటి మచ్చలు, కంటి క్రింద నల్లని వలయాలు పోతాయి.బరువు తగ్గాలి అనుకునే వారు లెమన్ జ్యూస్ తాగడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. ఇలా ఎన్నో పోషక విలువల కలిగి ఉంటాయి.జ్వరాన్ని తగ్గిస్తుంది మరియు మూత్రం సఫిగా అయ్యేలా చేస్తుంది అంతే కాకుండా మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
లెమన్ జ్యూస్ మరియు బేకింగ్ సోడా లేదా ఉప్పు కలిపి పళ్ళను తోమడం ద్వారా పళ్ళు శుభ్రంగా ఉంటాయి.అంతే కాదు దంత సమస్యలను నివారిస్తుంది.లెమన్ స్మెల్ చూడడం వల్ల తల తిరగడం వంతుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లెమన్ లో పోటాషియం అధికం గా ఉండడం వల్ల రక్త పోటు నివారణ అవుతుంది. అయితే లెమన్ జ్యూస్ ను పరగడుపును తీసుకోరాదు.
Also Read: Lemon Water: శరీరంలో అనేక రోగాలకు ఒక గ్లాస్ లెమన్ వాటర్