Water Apple: వాటర్ యాపిల్ అనే పేరు ఎప్పుడైనా విన్నారా? యాపిల్ గురించి వినుండొచ్చు, గ్రీన్ యాపిల్ గురించి వినుండొచ్చు, చివరకు ఐస్ యాపిల్ మరియు జావా యాపిల్ గురించి కూడా వినుండొచ్చు కానీ ఈ వాటర్ యాపిల్ ఏంటి కొత్తగా ఉంది అని అనుకుంటున్నారా! చాలామందికి తెలియని ఈ పండునే వైట్ జామూన్ అని, జంబూ ఫలం అని, రోజ్ యాపిల్ అని, గులాబ్ జామూన్ కాయలు అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు. వీటినే తెలుగులో కమ్మరి కాయలు అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పండునే బెల్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు.
వాటర్ ఆపిల్ ఈ సీజన్ లోనే దొరుకుతుంది…..కానీ ఇది అంతటా దొరకదు. అందుకే ఈ పండు ఎక్కడ కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే తినేయండి. వాటర్ ఆపిల్ చూడటానికి అచ్చం జామపండు లాగా ఉంటుంది. ఈ పండు పక్వానికి రాకముందు క్రీము – ఆకు పచ్చ రంగులో ఉంటుంది. ఇది పండిని తరువాత బెల్ ఆకారంలో ఆకర్షనీయమైన గులాబి రంగులోకి మారుతుంది.
Also Read: Groundnut harvesting and Storage: వేరుశనగ కోత మరియు నిల్వ సమయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు
వాటర్ ఆపిల్ పేరులో ఉన్నట్లు రుచిలో కాని సువాసనలో కాని రోస్ ను , యాపిల్ ను అస్సలు పోలి ఉండదు. ఇది తింటే ఎంతో రుచిగా ఉంటుంది….. అలాగే తీయగా కాస్త చేదుగా ఉంటుంది. కాని పక్వానికి రాని ఆకుపచ్చ రంగులో ఉన్నప్పుడు మాత్రం కాస్త వగరుగా ఉంటుంది. అందువలనే వీటిని ఊరగాయలు, జెల్లీ లు మరియు చట్నీల తయారీలో వాడతారు.
చూడటానికి ఎంతో ముద్దుగా ఉండే ఈ మొక్కను అలంకరణ కోసం ఆఫీసుల ముందు పెద్ద కార్యాలయాల ముందు పెంచుకుంటారు. ఈ వాటర్ యాపిల్ యొక్క చెక్కను పనిముట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే!దాని పేరులో ఉన్నటే ఈ పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది కావున ఈ వేసవిలో దాహార్తి ని తీర్చడంలో ఎంతో తోడ్పడుతుంది. వాటర్ యాపిల్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నెన్నో.
Also Read: Banana Leaf Health Benefits: అరటి ఆకు ఆరోగ్యానికి వరం.!