ఆరోగ్యం / జీవన విధానం

Ivy Gourd Health Benefits: దొండకాయలో పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలు

0
Ivy Gourd Health Benefits

Ivy Gourd Health Benefits: కాయగూరలు కేవలం ఆహారంలో మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. బయట మార్కెట్లో విరివిగా లభ్యమయ్యే కూరగాయల్లో దొండకాయ ఒకటి. మన దేశంలో దొండకాయను వివిధ రకాలుగా వినియోగిస్తారు. కూరలు, ఫ్రై, సలాడ్స్, జ్యూస్ ఇలా అన్ని విధాలుగా వాడుతారు. అయితే దొండ చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడుతుంది కదా అని దీని గురించి తక్కువ అంచనా వేసుకుంటే పొరబడినట్లే. దొండను ఎక్కువగా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Ivy Gourd Health Benefits

Ivy Gourd

దొండలో పీచు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటివి ఉంటాయి. అదేవిధంగా పిండి పదార్థాలు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు దొండకాయలో సమృద్ధిగా లభిస్తాయి.

Ivy Gourd juice

Ivy Gourd juice

Also Read: గోంగూరలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

ఇక దొండకాయ తినడం వలన రక్తహీనత తగ్గే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే గుణం దొండకాయల్లో ఉంది. . ఈ కూరగాయ జీర్ణకోశానికి మేలు చేకూరుస్తాయి. దొండకాయలో ఉండే పీచు పదార్థాలు ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తాయి. అంతేగాక రక్తంలో చక్కెర స్థాయిని సమాంతరంగా ఉంచుతుంది. ఇక దొండకాయ రసం తాగితే కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆస్తమాను నివారించడం, కాన్సర్‌ ముప్పు నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే బేటా కెరోటిన్‌ విటమిన్‌- ఏగా రూపాంతరం చెంది కంటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా మెరుగుపరుస్తుంది.

Ivy Gourd Health Benefits

Ivy Gourd Health Benefits

దొండకాయ ఆకు రసాన్ని 30 గ్రాముల మోతాదులో ప్రతిరోజూ తీసుకోవడం వలన మధుమేహం పూర్తిగా నయం అవుతుంది. దొండకాయ ఆకులు, నల్ల ఉమ్మెత్త ఆకులు, చిక్కుడు ఆకులలు సమానంగా తీసుకుని మూడు ఆకులను కలిపి దంచి వచ్చిన రసాన్ని అరికాళ్లకు రాసుకోవడం వల్ల అరికాళ్లలో వచ్చే మంటలు తగ్గుతాయి.

Also Read: పనస పండులో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

Leave Your Comments

Spice Seeds: సుగంధ పంట విత్తనాలను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చిన ICAR

Previous article

Telangana Agricultural Land Value: తెలంగాణ వ్యవసాయ భూములకు రెక్కలు

Next article

You may also like