ఆరోగ్యం / జీవన విధానంనేలల పరిరక్షణ

Integrated Parthenium Management: పార్థీనియం సమీకృత నిర్వాహణ

1
Parthenium
Parthenium

Integrated Parthenium Management: వయ్యారిభామ అని అందమైన పేరు గల ఈ మొక్కను ఆంగ్లంలో పార్థినియం హిస్టెరోఫోరస్ L., అని పిలుస్తారు. దీనికి అమెరికా అమ్మాయి ,నక్షత్ర గడ్డి , ముక్కుపుల్లాకు గడ్డి, క్యారెట్ కలుపు, వైట్ టాప్, కాంగ్రెస్ గ్రాస్, అపాది మొక్క వంటి పేర్లతో పిలుస్తారు. ఇది ఇది ఆస్టరేసి (కంపోజిటే) కుటుంబానికి చెందిన మొక్క.

Parthenium

Parthenium

ఇది గుల్మకాండ, నిటారుగా ఉండే మరియు వార్షిక మొక్క. క్యారెట్ మొక్క లాగా కనిపించడం వల్ల దీనిని గజర్ ఘాస్ అని కూడా పిలుస్తారు. పార్థినియం యొక్క ప్రస్థానం మెక్సికో, అమెరికా, ట్రినిడాడ్ మరియు అర్జెంటీనా నుండి వచ్చినదిగా పరిగణించబడుతుంది. 1956 మన దేశానికి దిగుమతి చేసుకున్న ఆహార ధాన్యాలతో పాటు మన దేశంలోకి ప్రవేశించియింది. 1956లో పూణే (మహారాష్ట్ర)లో పార్థీనియం సంభవించిన తర్వాత, అది భారతదేశం అంతటా దావానలంలా వ్యాపించింది.

ప్రస్తుతం ఇది భారతదేశంలో దాదాపు 35 మిలియన్ హెక్టార్ల భూమిని ఆక్రమించింది. ఇది వ్యవసాయ పంటలపై దాడి చేయడంతో పాటు రోడ్డు పక్కన మరియు రైల్వే ట్రాక్‌లు, ఖాళీ భూములు, బంజరు భూములు, పారిశ్రామిక ప్రాంతాలు, ఓపెన్ డ్రైనేజీ వ్యవస్థ మరియు నీటిపారుదల కాలువల వైపులా ఇబ్బంది కలిగిస్తుంది.

Also Read: Summer Chickpea (part I): వేసవి శనగ పంటను ఆశించు చీడపీడలు -యాజమాన్య పద్ధతులు

పార్థీనియం ఆకులు క్యారెట్ ఆకులను పోలి ఉంటాయి కనుక దీనిని క్యారెట్ కలుపు లేదా గజర్ ఘాస్ అంటారు. ఇది 1 నుండి 1.5 మీటర్ల ఎత్తు పెరుగుతుంది . ఇది శాఖలుగా ఉంది. కాండం మరియు ఆకులు చక్కటి వెంట్రుకలతో కప్పబడి ఉంతుంది పువ్వులు తెల్లగా ఉంటాయి.

ఇది ముఖ్యంగా విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది.సుమారు 15000-25,000 విత్తనాల ను ఉత్పత్తి చేయగలదు.ఇవి చాలా తక్కువ బరువు ఉండటం వలన గాలి, నీరు మరియు వివిధ మానవ కార్యకలాపాల ద్వారా విస్తరిస్తుంది.దీనికి విరిగిన బాగాల నుండి మళ్ళీ పెరిగె సామర్థ్యం కూడా కలదు.దీనికి అల్లెలో పతిక్ మరియు ఇతర కీటకాలు,వ్యాధులు వంటి సహజ శత్రువులు లేకపోవడం వల్ల భారత దేశంలో అతి వేగంగా వ్యాపిస్తుంది. వయ్యారి భామ అతిప్రమాకరమైన కలుపు మొక్క. ఇది పంటల పైనె కాకుండా మానవులు,  పశువుల పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.

40శాతం వరకు పంట దిగుబడిని తగ్గిస్తుంది. నత్రజని, పోషక విలువలు,శూక్ష్మధాతువుల శాతం తగ్గి స్తుంది. పంటలకు వేసిన ఎరువుల సారాన్ని కూడా పీల్చేస్తుంది.  కొన్ని రకాల వైరెస్ తెగుళ్లు కూడా వ్యాపిస్తాయి.వయారిభామ వల్ల మానవులకు డర్మటైటిస్, ఉబ్బసం,హైఫివర్,ఎగ్జిమా,బ్రాంకైటీస్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి.దాని పుప్పొడి పీలుస్తే కళ్ళు ఎర్రబడటం, జలుబు,చర్మం,శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చె అవకాశం ఉంది. సహజంగా పశువులు ఈ మొక్కను తినవు.దీని తిన్న పశువుల పాలు తాగితే జ్ఞాపకశక్తి దెబ్బ తింటుంది,ఇది తాకితె జంతువుల వెంట్రుకలు వాడిపోతాయి,ఇది తిన్న పశువుల జీర్ణక్రియ,లివర్,శ్వాసక్రియలు దెబ్బతింటాయి.

వయ్యారి భామను పంట పొలాల్లో పూత రాక ముందె పీకి బురదలో తొక్కెయాలి తరువాత నీరు పెడితె ఎరువుగా మారుతుంది. లేదా దీనిని పూత దశ ముందె వేళ్లతో సహా పీకి తగలబెట్టాలి.మరియు ఈ మొక్క పూత దశకు రాకముందే 10లీటర్ల నీటికి 5 కిలోల ఉప్పును కలిపి పిచికారి చేయాలి.
తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు.కావున పొలాల గట్లెంబడి మరియు బింజెరు భూముల్లో తంగేడు చెట్లు ఉండెటట్లు చూసుకోవాలి.

వర్షాకాలంలో నేల తడిగా ఉన్నప్పుడు పూతకు ముందె దీనిని తొలగించాలి.దీనిని తొలగించె అప్పుడు చేతులకు తొడుగులు ధరించడం లేదా పాలిథిన్ సంచులను ఉపయొగించడం మంచిది.పార్థీనియం నిర్వహణ చట్టబద్ధమైన చట్టం ద్వారా మొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో ప్రయత్నించబడింది. పార్థీనియం వ్యాప్తిని అరికట్టడానికి ఈ చట్టం మున్సిపాలిటీ లేదా రాష్ట్ర స్థాయిలో అమలు చేయబడుతుంది.

రసాయనాల ద్వారా నిర్మూలన:
వ్యర్థభూముల్లోని పార్తీనియంను గ్లైఫోసేట్ (1నుండి -1.5%) ద్వారా మొత్తం వృక్ష సంపదను నిర్మూలించవచ్చు. అయితే గడ్డిని కాపాడుకోవడానికి మెట్రిబుజిన్ (0.3 నుండి 0.5%) లేదా 2,4-D(2-2.5kg a.i.,) ఉపయేగించవచ్చు. [సోయాబీన్, రాజ్‌మహా, అరటి మరియు టొమాటో పంటలలో పార్థీనియంను తొలగించడానికి అలక్లోర్ (2.0 కిలోల a.i)ను మొదటిగా వాడవచ్చు. మెట్రిబుజిన్ (0.50 నుండి 0.75 కిలోల a.i) బంగాళాదుంప, టొమాటో మరియు సోయాబీన్ పంటలలో పార్థీనియంను అరికట్టడానికి విత్తిన తర్వాత ముందస్తుగా వాడుకోవచ్చు.

Also Read: Summer Chickpea(part II): వేసవి శనగ పంటను ఆశించు చీడపీడలు -యాజమాన్య పద్ధతులు

Leave Your Comments

Summer Chickpea(part II): వేసవి శనగ పంటను ఆశించు చీడపీడలు -యాజమాన్య పద్ధతులు

Previous article

Women’s Empowerment in Agriculture: జీవన నాణ్యత కోసం వ్యవసాయ మహిళల సాధికారత నమూనా 

Next article

You may also like