ఆరోగ్యం / జీవన విధానం

Impacts of Food Habits on Our Health: ఆరోగ్యంపై ఆహారపు అలవాట్ల యొక్క ప్రభావాలు!

0
Food Habits on Our Health
Food Habits on Our Health

Impacts of Food Habits on Our Health: ఆరోగ్యం-ఆహరం ఈ రెండు ఒకదానికి ఒకటి పరస్పర సంబంధం ఉన్నవని మనందరికీ తెలిసిన విషయమే.మన జీవనం యొక్క నాణ్యతను సుసంపన్నం చేయడం అనేది ప్రతి ఒక్కరూ సాధించాలని అనుకుంటున్న లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాన భాగం ఆరోగ్యకరమైన ఆహారంలో తీసుకోవడంలో ఉంది.ఆరోగ్యంగా తినడం అనేది సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్ ను తగ్గించడం మొదలగు వాటిపై ఆధారపడి ఉంటుంది. మనం తీసుకునే కేలరీల గురించి ఆందోళన చెందకూడదు, కానీ మనం తినే ఆహారం ద్వారా మనం తీసుకునే శక్తి రోజంతా వివిధ కార్యకలాపాలు చేస్తూ మనం ఖర్చు చేసే శక్తిని సమతుల్యం చేసేలా చూసుకోవాలి.కానీ ఇప్పుడున్న ఉరుకుపరుగుల కాలం లో చాలా మంది జంక్ ఫుడ్ కి అలవాటు పడ్డారు. ఈ జంక్ ఫుడ్ ఫలితం కారణంగా మనం అనారోగ్యాల భారిన పడే అవకాశాలు పెరుగుతున్నాయి.

మన ఆహారపు అలవాట్లు మన జీవనశైలి గురించి చాలా చెప్పగలవు. అందువల్ల, మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం, దాంతో ఆరోగ్యంగా తినడం వల్ల కలిగే అన్ని ప్రయోజనాలను మనం పొందగలుగుతాం.అనేక అధ్యయనాల ప్రకారం, తక్కువ పోషకాహారం తీసుకునే వ్యక్తులు, ఆరోగ్యకరమైన ఆహారం మరియు ఆరోగ్యకరమైన నిద్ర ఉన్న వ్యక్తుల కంటే తక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటారు అని వెల్లడించబడింది. మనకు తెలుసు, మన శరీరం ఒక యంత్రం వంటిదని. ఇది పనిచేయడానికి సరైన ఇంధనం అవసరం కావాలి. ఇది మానవ నిర్మిత యంత్రాల కంటే తెలివైనది, అందుకే మనం దానికి జోడించే చెత్తను (Junk food) ఇది తట్టుకుంటుంది. కానీ, ఏ మేరకు?మన జీవితంలో ఏదో ఒక సమయంలో, అది విచ్ఛిన్నమవుతుంది! అందువల్ల మనం తీసుకునే ఆహరం పట్ల జాగ్రత్త వహించాలి.

Also Read: Effect of Aloe vera on Hair: జుట్టుపై కలబంద యొక్క ప్రభావం!

Food Habits on Our Health

Food Habits on Our Health

కావున మన ఆహారపు అలవాట్లను నియంత్రించడం ద్వారా మన ఆరోగ్యాన్ని ఏవిధంగా మెరుగుపరుచుకోవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం…..మన ఆరోగ్యానికి మిశ్రమ ఆహరం మంచిది.మనం రోజు వరి అన్నం తినడానికి మాత్రమే అలవాటు పడిపోయాం, అలా రోజు ఒకే రకమైన ఆహరం తీసుకోవడం వల్ల మన శరీరానికి కావాల్సినన్ని పోషకాలు సమకూరవు, ఎందుకంటే దీనిలో లైసిన్ (Lysin) అనే అమైనో ఆమ్లము తక్కువగా ఉంటుంది, అయితే ఇది పప్పు ధాన్యాల్లో అధికంగా ఉంటుంది కావున మనం తీసుకునే అన్నానికి పప్పు ధాన్యాలను జోడిస్తే పోషకాలు సమకూరుతాయి.

మిశ్రమ ఆహరం ఆరోగ్యానికి మంచిది కాబట్టి అల్పాహారంలో ఇడ్లి, పులగం, పొంగలి తింటే మంచిది. అలాగే ప్రతిరోజు అల్పాహారం తీసుకోవడం మర్చిపోవద్దు.అలాగే మనం తీసుకునే ఆహరంలో తక్కువ ఉప్పు వాడాలి.ప్రతిరోజు పుష్కలంగా నీరు త్రాగాలి. మన డైట్ లో ఎక్కువగా పండ్లు మరియు కూరగాయలను ఉండేలా చూసుకోవాలి. అలాగే మనం తీసుకునే చిరుధాన్యాలలో రాగులు, సజ్జలు, మొక్కజొన్నలు వంటివి తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు లభిస్తాయి. అలాగే అటుకుల్లో ఎక్కువగా ఇనుము ఉంటుంది కాబట్టి అల్పాహారంలో ఇవి తీసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ విధమైన ఆహారపు అలవాట్లు పాటించడం వల్ల మనం మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.

Also Read: Vitamin B Deficiency: విటమిన్ B లోపాన్ని నివారించండిలా!

Leave Your Comments

Effect of Aloe vera on Hair: జుట్టుపై కలబంద యొక్క ప్రభావం!

Previous article

Medicinal Uses of Neem: వేపలోని దివ్యమైన ఔషధ గుణాలు!

Next article

You may also like