ఆరోగ్యం / జీవన విధానం

రోగనిరోధక శక్తి.. ఆక్సిజన్ స్థాయి కాపాడుకుందాం?

0

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న వేళ అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఆక్సిజన్ మన శరీర కణాల్లో శక్తిని పెంచుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. దీనికి బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే మార్గం. రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్ బీసీ) లోని ప్రధాన ప్రోటీన్ హిమోగ్లోబిన్. ఇది ఊరిపితిత్తుల నుంచి ఆక్సిజన్ ను వివిధ శరీర అవయవాలకు సరఫరా చేయడంతోపాటు అక్కడి నుంచి కార్బన్ డై ఆక్సయిడ్ ను వెనక్కు తీసుకుని వస్తుంది. ఈ ఆక్సిజన్ కణాల్లో శక్తిని తయారుచేసేందుకు తోడ్పడుతుంది. అందుకే శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ సరిగ్గా ఉంచుకోవాలనుకుంటే హిమోగ్లోబిన్ ను పెంచే ఆహార పదార్థాలు తినడం ఎంతో ముఖ్యం. పురుషులకు సుమారు 13.5 గ్రాములు/ డెసీ లీటర్ల హిమోగ్లోబిన్ అవసరమని డాక్టర్లు చెప్తున్నారు. హార్వర్డ్ హెల్త్, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం శరీరంలో హిమోగ్లోబిన్ తగినంత పాళ్లలో మెయింటెయిన్ చేయాలంటే కాపర్, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5, విటమిన్ బి6, ఫాలిక్ యాసిడ్, విటమిన్ బి12, తీసుకోవడం తప్పనిసరి. ఆహారంలో ఈ న్యూట్రియంట్స్ ఉండటం వల్ల రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి.
కాపర్:
సుమారు 90 గ్రాముల రాగుల్లో 245% కాపర్ లభ్యమవుతుంది. ఇది మనిషికి ఒక రోజుకు సరిపోతుంది. సుమారు 90 గ్రాముల పీతల్లో మనిషి రోజువారీ అవసరాలకు సరిపోయే కాపర్ లో 30% లభిస్తుంది. చాక్లెట్, ఆలుగడ్డ, నువ్వులు,జీడిపప్పు, శీతాకే మష్రూమ్ తదితరాల్లో కూడా తగినంతగా కాపర్ పొందవచ్చు. 30గ్రాముల చాక్లెట్ తీసుకుంటే 45% వరకు కాపర్ లభిస్తుంది.
విటమిన్ బి6, బి9, బి12:
విటమిన్ బి6,బి9 ఆర్గాన్ మీట్(లివర్), కోడిమాంసం, టూనా చేప తదితరాలతోపాటు అరటిపండు, పాలకూర, బ్రసెల్స్ మొలకల్లో పుష్కలంగా లభిస్తాయి. సహజంగా శాఖాహారంలో విటమిన్ బి12 లభించదు. కానీ బ్లాక్ ట్రంపెట్, గోల్డ్ శాన్ ట్రెల్ అనే పుట్టగొడుగులో లభిస్తుంది. సముద్ర కూరగాయాలైన గ్రీన్ లావెర్, పర్పల్ లావెర్ లోనూ లభిస్తుంది.
విటమిన్ బి2 (రైబోఫ్లేవిన్):
కోడిగుడ్లు, ఆర్గాన్ మీట్( కిడ్నీ, లివర్), పాలు తదితరాల్లో అధిక పాళ్ళలో ఉంటుంది. 90 గ్రాముల లివర్ తీసుకుంటే రోజుకు కావాల్సిన రైబోఫ్లేవిన్ లో 223% పొందవచ్చు. ఓట్స్, పెరుగు, పాలు, బాదం, పనీర్, పొట్టుతో కూడిన యాపిల్, బీన్స్, సన్ ఫ్లవర్ గింజలు, టమాట తదితరాలు తీసుకున్నా రైబోఫ్లేవిన్ లభిస్తుంది.
ఐరన్ :
మేక, బాతు, కోడి తదితర మాంసంలో తగినంత ఐరన్ లభిస్తుంది. 180 గ్రాముల మాంసంలో ఒక రోజుకు కావాల్సిన ఐరన్ లో సుమారు 52% లభిస్తుంది. బీన్స్, ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, పప్పు, బఠాణీ గింజలు తదితరాల్లో కూడా ఐరన్ ఉంటుంది. ఒక కప్పు పప్పు తీసుకుంటే 100% ఐరన్ అవసరాన్ని తీర్చుకోవచ్చు.
విటమిన్ బి5:
ఆర్గాన్ మీట్(లివర్), చికెన్, టూనా చేప, కోడిగుడ్లు తదితర మాంసాహార పదార్థాల్లో విటమిన్ బి5 అధికంగా లభిస్తుంది. 90 గ్రాముల ఆర్గాన్ మీట్ లో రోజువారీ అవసరాల్లో 166% వరకు విటమిన్ బి5 లభిస్తుంది. పుట్టగొడుగులు, పొద్దుతిరుగుడు గింజలు, ఆలుగడ్డ, పెసరపప్పు, బ్రౌన్ రైస్, బ్రోక్లీ, ఓట్స్, పనీర్ తదితరాల్లో 52 శాతం వరకు విటమిన్ బి5 లభిస్తుంది. విటమిన్ ఏ కూడా ఐరన్ వంటిదే. మాంసంలోని లివర్ భాగం, గుడ్లు తగినంతగా తీసుకోవడం ద్వారా ఇది లభిస్తుంది. సుమారు 90 గ్రాముల మాంసంతో రోజువారీ అవసరాల్లో 444% విటమిన్ ఏ లభిస్తుంది. గణుసుగడ్డ, క్యారెట్, అణిగెకాయ, మామిడి పండు, పాలకూర, బీట్ రూట్ తదితరాల్లోనూ విటమిన్ ఏ లభిస్తుంది. వెనీలా ఐస్ క్రీమ్ లో కూడా విటమిన్ ఏ ఉంటుంది. అరకప్పు క్యారెట్ తీసుకుంటే రోజువారీ అవసరాల్లో 184% విటమిన్ ఏ లభిస్తుంది.
విటమిన్ బి3 (నైసిన్ ):
మాంసాహారంలో ఇది అధికంగా ఉంటుంది. తృణధాన్యాలు, అక్రోట్, విత్తనాలు, ఇతర శాఖాహార పదార్థాల్లో కూడా ఇది లభిస్తుంది. 90 గ్రాముల చికెన్ లో రోజువారీ అవసరాల్లో 50 శాతం లభిస్తుంది. ఒక కప్పు అన్నంతో 12 – 26 శాతం వరకు అవసరం తీరుతుంది. కాల్చిన ఆలుగడ్డ, కాల్చిన పొద్దుతిరుగుడు, సొరకాయ గింజలు, కాల్చిన వేరుశనగ తదితరాల్లో 8% నుంచి 26% వరకు నైసిన్ లభిస్తుంది.
శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పుష్కలంగా ఉండాలంటే కావలసిన న్యూట్రియంట్స్
విటమిన్ బి2 – 1.7 ఎంజీ, కాపర్ – 2ఎంజీ, విటమిన్ బి6 – 2ఎంజీ, ఐరన్ – 18ఎంజీ, విటమిన్ బి3 – 20 ఎంజీ, విటమిన్ బి9 – 400 మైక్రోగ్రామ్, విటమిన్ ఏ- 5000 ఇంటర్నేషన్ యూనిట్స్, విటమిన్ బి6, బి12 – 6 ఎంజీ.

Leave Your Comments

మామిడి కాయలు మరియు పండ్లతో వివిధ ఉత్పత్తుల తయారీ

Previous article

వంట నూనెల్లో ఏది మంచి నూనె..

Next article

You may also like