ఆరోగ్యం / జీవన విధానం

ఈ మొక్కలు ఉంటే దోమలు దరిచేరవు..

0

ఇంటి చుట్టూ మొక్కలను పెంచితే దోమలు ఎక్కువగా వచ్చేస్తాయని కొందరు భయపడతారు. కానీ కొన్ని రకాల మొక్కలు దోమలను దూరంగా తరిమేస్తాయి.
తులసి:
సాధారణంగా ప్రతి ఇంట్లోనూ ఈ మొక్క కనిపిస్తుంది. ఎన్నో రకాల ఔషధాల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు. దోమలతో పాటుగా పురుగులనూ ఇది తరిమి కొడుతుంది.
లావెండర్:
సువాసనలను వెదజల్లే ఈ మొక్క కీటకాలనూ దరిచేరనివ్వదు. దోమలు, ఈగలు, ఇతర కీటకాలను దూరంగా తరిమేస్తుంది.
లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి):
ఈ గడ్డి నుంచి వెలువడే నిమ్మ సువాసనలు దోమలను దూరంగా ఉంచుతాయి.
లెమన్ థైమ్:
ఈ మొక్క నుంచి కూడా నిమ్మ వాసనలు వస్తాయి. ఇది దోమలను తరిమేయడమే కాకుండా.. తేనెటీగలను ఆకర్షిస్తుంది.
అగిరేటమ్:
దీన్నే గోట్ వీడ్, జంగిల్ పుదీనా అనికూడా అంటారు. దీనికి వంగపండు రంగు పూలు కూడా పూస్తాయి. దీన్నుంచి వచ్చే నూనెను దోమల నివారణ మందుల్లో ఉపయోగిస్తారు.
క్యాప్ నిప్:
దీన్నే క్యాట్ మింట్ అని కూడా అంటారు. దీన్నుంచి వచ్చే నూనెలను దోమల నివారణ మందులు, పెర్ ఫ్యూమ్స్లలోనూ వాడతారు.

Leave Your Comments

రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు..

Previous article

బ్రొకోలీ సాగుతో మంచి లాభాలు ఆర్జిస్తున్న యువరైతు..

Next article

You may also like