Milk Health Benefits: పాలలో పోషక పదార్థాలు మెండుగా ఉన్నప్పటికీ, అవి చాలా త్వరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయి. పాలు బాక్టీరియా వృద్ధికి అనుకూలంగా ఉండడమే దీనికి కారణం. కలుషితమైన పాలు త్వరగా పులిసిపోతాయి, చెడిపోతాయి. మార్కెట్లో అపరిశుభ్రమైన, కలుషితమైన పాలకు ధర పలకనందున, రైతులు నష్టపోవాల్సి వస్తుంది. పాలు ఎంత తాజాగా, నాణ్యతగా, శుభ్రంగా ఉంటే, మార్కెట్లో డిమాండ్ అంత బావుంటుంది. ప్రపంచ వాణిజ్య సంస్థలో సభ్యత్వం ఉన్న మన దేశంలో, ఆ సంస్థ ద్వారా నాణ్యతా ప్రమాణాలు అమలవుతున్నాయి. వాటిని పాటిస్తే మన ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకి రావడానికి సహకరిస్తాయి. రైతులకు లాభం చేకూరుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రస్తుత పోటీ ప్రపంచంలో పాల వ్యాపార వ్యవస్థ స్థిరంగా ఉండి, రైతు ఉత్పత్తి చేసే పాలకు, పాల పదార్థాలకు గిట్టుబాటు ధర రావాలంటే, స్వచ్ఛమైన, నాణ్యమైన, పాలు చాలా అవసరం.
రైతు స్థాయిలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి కొరకు ఆరోగ్యమైన, వ్యాధులు సోకని పశువుల నుండి మాత్రమే పాలు పితకాలి శుభ్రమైన పాత్రలనుపయోగించి, పరిశుభ్రమైన పాకల్లో, పరిసరాల్లోనే పాలు పితకాలి.వాడే నీరు శుభ్రంగా ఉండాలి.పాలు పితికే వ్యక్తికి టైఫాయిడ్, టిబి లాంటి వ్యాధులు, పొడవాటి గోళ్ళు ఉండకూడదు. వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి.పాలల్లో ఆక్సిటోసిన్, ఆంటిబయాటిక్, క్రిమిసంహారక మందుల అవశేషాలు ఉండకుండా జాగ్రత్తవహించాలి.పాలను శీతలస్థితిలో ఉంచి బాక్టీరియా వృద్ధిని అరికట్టే ప్రయత్నం చేయాలి.పాలలో నీళ్ళు, పిండి, సోడా, ఉప్పు, పంచదార, నూనెలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి పదార్థాలతో కల్తీ చేయరాదు. రాత్రి పాలను, ఉదయం పాలతో కలుపకూడదు.జున్ను పాలను కేంద్రానికి పోయకూడదు. పాలల్లో ఈగలు, క్రిములు, గడ్డిపరకలు పడకుండా జాగ్రత్త వహించాలి.
Also Read: Percentage of Butter in Milk : పాలలోని వెన్న శాతం ను ఎలా కనుక్కోవాలి.!
రైతు స్థాయిలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే పాలు ఎక్కువ కాలం, తాజాగా చెడిపోకుండా ఉంటాయి. త్వరగా పాడవకుండా ఉంటాయి. పాల నుండి తయారు చేసిన నెయ్యి, వెన్న మొదలగు పాల పదార్థాలు నాణ్యత కలిగి, ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. దూర ప్రాంతాలకు రవాణా వీలవుతుంది. పాల ద్వారా వ్యాధులు సంక్రమించే అవకాశాలుసన్నగిల్లుతాయి. పాలు, పాల ఉత్పత్తులకు మంచి ధర లభించి, లాభాలు రైతుల వెంటే ఉంటాయి.
పాడి పరిశ్రమకు బంగారు భవిష్యత్తు-
పాల ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడం తక్కువ పశువులతో, ఎక్కువ పాల దిగుబడులు పొందడం,నాణ్యత కలిగిన పాలను ఉత్పత్తి చేయడం అనే అంశాలపై ఆధారపడి ఉన్నందున, పశుపోషకులు. మారుతున్న పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకుని, నాణ్యత కలిగిన పాలు, పాల ఉత్పత్తుల ఉత్పత్తి పట్ల శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.
పాలు, నెయ్యిలో కల్తీని కనిపెట్టే కొత్త పరికరాలు-
పాల కల్తీని అరికట్టే ప్రక్రియల్లో భాగంగా హర్యానా రాష్ట్రం కర్నాల్లో ఉన్న జాతీయ పాడి పరిశోధన సంస్థ (ఎన్ఆర్ఐ) కొత్త పరికరాలను అభివృద్ధి చేసింది. వీటితో పాలలో కల్తీని గుర్తించవచ్చు. పాలలో గంజి, చక్కెర, గ్లూకోజ్, అమ్మోనియా మిశ్రమాలు, యూరియా, ఉప్పు, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫార్మలిన్, డిటర్జెంట్ వంటి పదార్థాలు ఏమైనా కలిపారా అనేది వెంటనే తెలుసుకోవచ్చు. రాజ్యసభకు 23-11-2012న ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో కేంద్ర వ్యవసాయ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్ ఈ విషయాన్ని తెలిపారు. అలాగే ఈ సంస్థ అభివృద్ధి చేసిన ఒక కిలో నెయ్యిలో వనస్పతి కల్తీని కూడా పరీక్షించవచ్చని చెప్పారు. ఈ కిట్లను విక్రయించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని కంపెనీలకు ఈ సంస్థ ప్రతిపాదన పంపిందన్నారు.
Also Read: Milk Production: పాల ఉత్పత్తి పై ప్రభావితం చూపే వివిధ అంశాలు.!
Also Watch: