Pure Ghee: నెయ్యిని డాల్డా, బొక్కలను మరిగించి తీసిన నూనె, పామాయిల్తో తయారు చేస్తారు. అవును నిజమే… మనం తినే నెయ్యి వాటితోనే తయారు చేస్తారు. స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ దొరకడం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ నెయ్యిని ఇష్టంగా తింటారు. నెయ్యి ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కానీ ఈ కల్తీ నెయ్యి తిన్నడం వల్ల ప్రజల ప్రాణాలకి హాని కలుగుతుంది. అసలు మనం తిన్నె నెయ్యి స్వచ్ఛమైనదా లేదా కల్తీ అని ఎలా గుర్తించాలి.
మార్కెట్లో నెయ్యిలో చాలా వరకు కల్తీ నెయ్యిని మాత్రమే అమ్ముతున్నారు. కొని కంపెనీల నెయ్యిలో కొబ్బరినూనె కలిపి అమ్ముతున్నారు. కొబ్బరినూనె చల్లగా ఉన్నపుడు గడ్డగా ఉండుండి. కొబ్బరినూనె కాబట్టి తీయగా కూడా ఉంటుంది. దీని అసలు గుర్తించలేకపోతున్నాము.
నిజమైన నెయ్యి కొద్దిగా పసుపు లేదా బంగారు రంగులో ఉంటుంది. నెయ్యికి మృదువైన ఆకృతి రాదు. నెయ్యి రవ్వ రవ్వ ఆకృతి ఉంటుంది. ఈ రవ్వ కొద్దిగా తెల్లగా ఉంటుంది. నెయ్యి సువాసన చాలా బాగుంటుంది. ఈ కల్తీ నెయ్యి తయారి మొదలు పెట్టక ఆ నెయ్యికి సువాసనలు మిక్స్ చేస్తున్నారు. ప్రిజర్వేటివ్‌ల వల్ల కూడా కల్తీ నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
Also Read: Sarugudu Cultivation: రైతుకు మంచి లాభాలు తెచ్చిపెట్టే ‘సరుగుడు సాగు’
మనం కొనే నెయ్యి నిజమైనదా లేదా నకిలీదని గుర్తు పట్టడానికి ఒక చెంచా నెయ్యిని అరచేతిలో తీసుకోండి. నెయ్యి కరిగి పోయే దాకా అలాగే ఉండండి. మీరు తీసుకున్న నెయ్యి త్వరగా కరిగిపోతే అది మంచి నెయ్యి.
నెయ్యి కరగడానికి చాలా సమయం పడితే అది కల్తీది . ఎందుకంటే నిజమైన నెయ్యి మన శరీర ఉష్ణోగ్రతతో కలిసిన వెంటనే కరగడానికి ఎక్కువ సమయం పట్టదు.నెయ్యిని కొబ్బరి నూనెతో తయారు చేశారు అని గుర్తించడానికి డబుల్-బాయిలర్ పద్ధతి చేయాలి .
దీని కోసం పాన్‌లో నీళ్లు పోసుకోవాలి, ఇంకో గిన్నెలో నెయ్యి వేసుకొని వేడి చేయాలి. నెయ్యి కరిగిన తర్వాత డబ్బాలో పోసి కొద్ది సేపు ఫ్రిజ్లో పెట్టాలి. కొబ్బరి నూనెను నెయ్యిలో కలిపితే, నెయ్యి, కొబ్బరి నూనె వేరు వేరు పొరలా గడ్డ కట్టడం కనిపిస్తుంది. ఇలా చేసి నెయ్యిలో కల్తీ గుర్తి, నిజమైన నెయ్యిని మాత్రమే తీసుకోవచ్చు.
Also Read: Yarsagumba Mushroom: ఈ రకం పుట్టగొడుగులు కిలో 20 లక్షలు.!