Honey Adulteration Test: తేనె ప్రతి ఇంటిలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ వాడుతుంటారు. తేనెని ప్రతి రోజు తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి. స్వచ్ఛమైన తేనె మన ఆరోగ్యాని పెంచుతుంది. తేనె పూర్వం అడవుల్లో మాత్రమే దొరికేది. కానీ ఇప్పుడు ఇళ్ల పెరడులో కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో దొరికే తేనె చాలా వరకు కల్తీ జరుగుతుంది. ఈ కల్తీని ఎలా గుర్తించాలి. ఈ కల్తీ తేనె వాడితే ప్రాణాలకి హాని జరుగుతుంది. ఎందుకంటే నకిలీ తేనె ఆరోగ్యంపై చెడు ప్రభావాలను చూపిస్తుంది. తేనె స్వచ్ఛతను తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి.
తేనె స్వచ్ఛమైనదా కదా అని తీసుకోవడానికి కొంచం తేనెని నీటిలో వేయండి. ఆ తేనె నకిలీది అయితే నీటిలో తొందరగా కలిసిపోతుంది. స్వచ్ఛమైన తేనె నీటిలో తొందరగా కలవదు. నీటిలో వేసిన వెంటనే నీటి అడుగు భాగంలోకి వెళుతుంది. కొంచం సేపు పూర్తి అయ్యాక నీటిలో కలిసిపోతుంది. తేనె నీటిలో తొందరగా కారిపోవడం లేదా నీటిలో తేలితే ఆ తేనె కల్తీది అని గుర్తించాలి.
Also Read: Curry leaves Cultivation: కరివేపాకు సాగుతో రైతులకి బారి లాభాలు ఎలా సంపాదిస్తున్నారు.. ?
తెలుపు వస్త్రం పై కొంచం తేనెని వేసి కాసేపు ఉంచాలి. ఆ వస్త్రం తేనెని పిచుకొని, వస్త్రం పై రంగు మారక పడితే అది కల్తీ తేనె అని గుర్తించాలి. స్వచ్ఛమైన తేనెని వస్త్రం పీల్చుకోదు. మారక కూడా పడదు వస్త్రం పైన.
అగ్గి పుల్లకి కొంచం పత్తిని చుట్టుకొని కాసేపు తేనెలో ముంచాలి. కాసేపు అయ్యాక ఆ అగ్గి పుల్లని కొవ్వొత్తితో కాల్చాలి. పత్తి మంటలో కలిపితే అది స్వచ్ఛమైన తేనె. పత్తికి మంటలు అంటుకోకపోతే అది కల్తీ తేనె అని గుర్తించాలి.
తేనెని కొంచం చేతిలో చుక్కలుగా వేసుకోవాలి. కల్తీ తేనె సులువుగా కదులుతుంది. స్వచ్ఛమైన తేనె కదలదు. ఈ విధంగా తేనెలో కల్తీని గమనించి స్వచ్ఛమైన తేనెని తిన్నవచ్చు.
Also Read: Yellow Chilli: పసుపు రంగు మిర్చిని మీరు చూశారా.!