Dragon Fruit Health Benefits: ఎవరైతే కీటకాల ద్వారా సంక్రమించే వ్యాధులతో బాధపడుతున్నారో అనగా మలేరియా, డెంగ్యూ వారి ప్లేట్‌లెట్ల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే ప్రాణాంతకం అయే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ప్రతి మైక్రో లీటరు రక్తంలో 150,000 నుండి 450,000 ప్లేట్‌లెట్లు ఉంటాయి.ఈ ప్లేట్‌లెట్లు గాయం అయినప్పుడు రక్తనాళాల లో గడ్డకట్టి రక్తస్రావాన్ని ఆపుతాయి.ఇలా రక్తంలోని ప్లేటిలెట్స్ తగ్గినపుడు, డ్రాగన్ ఫ్రూవ్ట్ రక్తాన్ని పెంచడంలో మేలు చేస్తుంది. నేటి రోజుల్లో ఈ పండు మంచి ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ డ్రాగన్ ఫ్రూట్ లోని యాంటీ ఆక్సిడెంట్ డెంగ్యూ రోగులలో ప్లేట్‌లెట్లల సంఖ్యను మెరుగుపరచడానికి దోహదపడతాయి, అలాగే పంట పండించే రైతులకి కూడా లక్షల్లో లాభాలు సమకూర్చుతుంది.
ఈ గుణం వల్లన వైద్యులు దీనిని డెంగ్యూ రోగులకు డ్రాగన్ ఫ్రూట్‌ను సిఫార్సు చేస్తారు.
1. ముఖ్యంగా ఎర్రటి మాంసం కలిగిన డ్రాగన్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అది తినడం వలన అవి చర్మాన్ని గట్టిగా మరియు యువ్వణంగా ఉంచి కాపాడుతుంది. ఈ పండ్లని తేనెతో కలిపి యాంటీ ఏజింగ్ ఫేస్-మాస్క్‌లను తయారీ చేయవచ్చు. కృత్రిమ ఫేస్-మాస్క్‌లకు ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం.చర్మం చాలా కంటి వంతంగా చేస్తుంది.
2. కీళ్లనొప్పులు నేరుగా కీళ్లను ప్రభావితం చేస్తాయి.ఇంకా తీవ్రమైన చికాకు మరియు అస్థిరతకు గురిచేస్తాయి. కావున మనం రోజూ తినే ఆహారంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ను జోడించడం వలన ఈ అనారోగ్యాలను నయం చేయవచ్చ. కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వ్యక్తులకి డ్రాగన్ ఫ్రూట్ వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి దీనిని సాధారణంగా “యాంటీఇన్‌ఫ్లమేటరీ ఫ్రూట్” అని కూడా అంటారు.
Also Read: వేసవి లో మజ్జిగ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు
3. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి మరియు బి3 అనె పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అవి మొటిమలు మరియు కాలిన చర్మాన్ని నయం చేయడంలో ఉపయోగపడతాయి.ఫైర్ ఆక్సిడెంట్ అయిన రోగులకు సిఫారసు చేస్తారు డాక్టర్లు.
4. డ్రాగన్ ఫ్రూట్‌లో చాలా తక్కువ మొతాదులో కొలెస్ట్రాల్ ఉంటుంది కావున కొవ్వు చేరడం వలన వచ్చే వ్యాధులు మరియు గుండెపోటు వచ్చే అవకాశాలని తగ్గిస్తుంది.ఇది బరువును నిర్వహించడానికి ఉపయోగపడుతుంది.
5. ఇందులో ప్రొటీన్ మరియు ఒమేగా-3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి హృదయకాళ వ్యాధులను నిరోధించడంలో సహాయపడతాయి.ఇందులో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వు గుండెను గొప్ప స్థితిలో ఉంచుతాయి.
6.ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వలన అజీర్ణతను మరియు మలబద్ధకాన్ని తొలగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడానికి సహాయపడుతుంది. ఈ పండు గుజ్జులో మరియు గింజల్లో ప్రోటీన్లు ఉంటాయి అవి శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది.
7. ఇందులో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ల ఫ్రీ రాడికల్స్ వలన వచ్చే కాన్సెర్ ను, ఇతర ఆరోగ్య నష్టాలను నివారిస్తాయి.ఈ యొక్క యాంటీ ఆక్సిడెంట్స్ రకాలు, సంఖ్య, మరియు నాణ్యతలు డ్రాగన్ ఫ్రూట్ లో తప్పా ఇతర ఏ ఆహార సప్లిమెంట్లలో కాని మాత్రల్లో కాని ఉండవు.
8. ఇందులో మామిడి కంటే 2.2 గ్రా , స్వీట్ ఆరెంజ్ కంటే 1 గ్రా, అరటిపండు కంటే 2.4 గ్రా ఎక్కువ ఫైబర్ ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్‌లోని అధిక మొత్తంలో ఫైబర్ షుగర్ పెరుగుదలను తగ్గించి రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కావున మధుమేహాన్ని నియంత్రించడంలో తోడ్పడుతుంది.
Also Read: చర్మ సమస్యల్లో లవంగం మరియు కొబ్బరి నూనె పాత్ర