భారతదేశంలో అనేక రకాల ఆకుకూరలు వినియోగంలో వున్నాయి. ఎందుకంటే ఆకుకూరలు అందరికి చౌకగా లభ్యం అయ్యే మంచి పోషక విలువలు గలిగిన ఆహారం. తోటకూర, చుక్కకూర, బచ్చలికూర, పొన్నగంటి కూర, గోంగూర, మెంతికూర, గంగబాయిలాకు, చేమ, ముల్లంగి ఆకులు, ఇలా ఎన్నో రకాల ఆకుకూరలు అందుబాటులో వున్నాయి. ఆకుకూరలలో లభ్యమయ్యే బీటా కెరోటిన్ (విటమిన్ ఎ) కంటిజబ్బులను నివారిస్తుంది. ఇంతే కాకుండా ఆకుకూరలను వారంలో మూడు సార్లు కంటే ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులకు దూరంగా వుండవచ్చునని పరిశోధనల ద్వారా తెలిసింది. తోటకూర, పాలకూర, గోంగూరలలో విటమిన్ ‘ సి’ అధికంగా వుంటుంది. ఇది రోగ నిరోధక శక్తి పెంచడంతో పాటు పంటి చిగుళ్ళు మరియు ఎముకలు పటిష్టంగా తయారవడానికి ఉపయోగపడుతుంది. ఆకుకూరలలో కాల్షియంతోపాటు ఇనుము కూడా అధికంగా వుంటుంది. రక్తహీనతను నివారిస్తుంది. కరివేపాకులో కాల్షియం, ఇనుముతోపాటు విటమిన్లు కూడా వుంటాయి. ఆరోగ్య పరిరక్షణలో కరివేపాకు ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో మంచి నేస్తం కరివేపాకు. తోటకూర, శనగకూర, అలసంద ఆకులు, బచ్చలి, పొన్నగంటి మొదలైనవి వాటిలో ఇనుము ఎక్కువగా లభిస్తుంది. ఆకుకూరలలో పీచు పదార్థం మలబద్దకాన్ని అరికట్టడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో వుంచుతుంది. కాబట్టి రోజు తీసుకునే ఆహారంలో 100 -150 గ్రా. ఆకుకూరలు వుండేటట్లు చూడాలి.
గుర్తించుకోవాల్సిన విషయాలు :
తాజా ఆకుకూరలు వెంటనే వండుకోవాలి. రెండు మూడు రోజుల కంటే వెంటనే వండుకోవడం మంచిది. ఆకుకూరలు రెండు మూడు సార్లు ఉప్పు నీటిలో కడిగి నిల్వ ఉంచితే మంచిది. ఆకుకూరలలో వుండే నీరు ఆకుకూరలు వండటానికి సరిపోతుంది. ఆకుకూరలు వండేటప్పుడు మూత పెట్టాలి. ఆకుకూరలు కడిగిన తర్వాత తరుగుకోవాలి. ప్రెషర్ కుక్కర్ లో వండితే ఇంకా మంచిది. ఆకుకూరలు విడి కూరగాను, పప్పుకూరలతోని కాని పచ్చడిగా కాని పొడులుగా వివిధ రకాలుగా వాడుకోవచ్చు. ఆకుకూరలను, వండేటప్పుడు ఎక్కువసేపు మరిగిస్తే వీటిలో ఉన్న విటమిన్ ‘ సి ’ ఆవిరైపోతుంది. దీన్ని నివారించటానికి ఆకుకూరలను స్వల్ప వ్యవధిలోనే వండాలి.
ఆకుకూరలలో సాధారణంగా కేలరీలు మరియు కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. పీచు పదార్ధం, ఇనుము, కాల్షియం అధిక మోతాదులో వుంటాయి. వృక్ష సంబంధ రసాయనాలు ( ప్రైటో కెమికల్స్) అయిన విటమిన్ సి, ఎ మరియు ఫోలిక్ ఆమ్లం అధికముగా వుంటాయి. విటమిన్ – ఎ లోపం కారణంగా భారతదేశంలో ప్రతి ఏటా ఐదేళ్ళలోపు వయస్సు పిల్లలు సుమారు 30 వేలమంది కంటి చూపును కోల్పోతున్నారు. ఆకు కూరలు ద్వారా లభించే కెరోటిన్ మన శరీరంలో విటమిన్ “ ఎ ” గా మారి అందత్వం రాకుండా చేస్తుంది.
Also Read : పుట్ట గొడుగులు – పోషకాల గనులు
వివిధ ఆకు కూరలలో పోషక విలువలు :
100 గ్రా | పుదీనా | తోటకూర | పాలకూర | మునగాకు | కొత్తిమీర | గోంగూర |
కాల్షియం మి.గ్రా | 200 | 397
|
73 | 440 | 184 | 1720 |
ఇనుము మి.గ్రా | 15 -6 | 25 -5 | 10.9 | 7.0 | 18.5 | 2.28 |
కెరోటిన్ మి.గ్రా |
1620 |
5520 |
5580 |
6780 |
6918 |
2898 |
ధైమిన్ మి.గ్రా |
0.05 |
0-03 |
0-03 |
0-06 |
0-05 |
0-07 |
రిబోప్లావిన్ మి.గ్రా |
0.26 |
0.30 |
0.26 |
0.06 |
0.06 |
0.39 |
విటమిన్స్ మి.గ్రా |
27-0 |
99 |
28 |
220 |
135 |
20.2 |
శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయము, కృషి విజ్ఞాన కేంద్రం, లాం గుంటూరు
Also Read : మినుములో తెగుళ్ళు – యాజమాన్యం