Ponnaganti leaves Health Benefits: మన ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు లభిస్తాయి, కానీ చాలా వాటి యొక్క ప్రయోజనాల గురించి మనకు తెలియకపోవచ్చు. ఈ ఔషధ మొక్కల్లో ఒకటైన పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందజేస్తుందో ఇందులో మనం తెలుసుకుందాం. పొన్నగంటి కూర ఆకులలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. ఈ ఆకులలో బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు విటమిన్ ‘ఎ’, ‘బి6’, ‘సి’, ఫొలేట్, ‘రైబోఫ్లెవిన్’, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీనిలో సమృద్ధిగా దొరకుతాయి. పొన్నగంటి కూర ఎక్కువగా తేమ ఉన్న ప్రాంతాల్లో పెరుగుతూ ఉంటుంది. దీనికి విత్తనాలు ఉండవు, దీని ఆకులు సన్నగా పొడుగ్గా ఉంటాయి. పొన్నగంటి కూర మనకు ఏడాది పొడవునా లభిస్తుంది.
పొన్నగంటి కూర జుట్టు సమస్యలను నివారించడానికి ఎంతో మేలు చేస్తుంది. జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన బయోటిన్ ఈ పొన్నగంటి కూరలో పుష్కలంగా దొరుకుతుంది. ఆయుర్వేదం మరియు పురాతన గ్రంథాల ప్రకారం పొన్నగంటి కూరను 48 రోజుల పాటు తింటే కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందంట, అలాగే దీనితో పాటు చర్మ కాంతి కూడా అభివృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: Villa Mart: పొలం వద్దే పంట కొనుగోళ్లు చేస్తూ అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తున్న “విల్లా మార్ట్”
బరువు తగ్గాలనుకునే వారికి పొన్నగంటి కూర అద్భుతమైన ఆహారంగా చెప్పుకోవచ్చు. దీనిలో ఉండే పోషాకాలు శరీరంలోని కొవ్వుని తగ్గించి బరువు తగ్గడంలో తోడ్పడతాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా పొన్నగంటి కూర మంచి ఫలితాన్ని ఇస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. పొన్నగంటి కూరలో లభించే విటమిన్లు మరియు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పొన్నగంటి కూర రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించి మధుమేహ రోగులకు ప్రయోజకరంగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో చాలా మందికి కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతున్నాయి, ఈ నల్లటి వలయాలను నివారించడానికి పొన్నగంటి కూర ఎంతగానో తోడ్పడుతుంది. గుండె మరియు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పొన్నగంటి కూర సహాయపడుతుంది. పొన్నగంటి కూరలో లభించే పోషకాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాలతో కూడా పోరాడతాయి. కిడ్నీ సమస్యలున్న వారికి పొన్నగంటి కూర చాలా ప్రయోజకరంగా ఉంటుంది. పొన్నగంటి కూరను శరీరంలోని వేడిని తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. చర్మ సంబంధిత సమస్యలు, జీర్ణ వ్యవస్థ సమస్యలు, తలనొప్పి వంటి సమస్యలున్న వారికి కూడా ఈ పొన్నగంటి కూర మంచి ఫలితాన్నిస్తుంది.
Also Read: Taro Root Health Benefits: చామదుంపలతో ఇక మీ చింతలన్నీ దూరం.!