ఆరోగ్యం / జీవన విధానం

Terminalia Chebula Health Benefits: కరక్కాయతో ఎన్నో ఉపయోగాలు.!

1
Terminalia Chebula Health Benefits
Terminalia Chebula Health Benefits

Terminalia Chebula Health Benefits: కరక్కాయ దీనిని అభయం, హరీతకీ, జయస్ట్రా, పద్యా, అమృతా, కాయస్తా, హేమావతి, శివా, జీవంతీ అను పేర్లతో వ్యవహరింతురు ఇంగ్లీషులో చెబులిక్ మైరోబులమ్ అని పిలుస్తారు. ఆయువు వృద్ధి చేయుట చేత జీవంతి అని, శరీరము శుద్ధి పరుచుట వలన పూతన అని, అమృత ప్రాయముగ ఉండుట వలన అమృత ఆని, అమృత ప్రాయముగ ఉండుట వలన అమృత అని, జయము కలుగజేయుట వలన విజయ అని, భయమును పోగొట్టు గుణము కలిగి ఉండుట వలన అభయ అని, మంచి గుణమును ఇచ్చుట వలన రోహిణి అని జ్ఞానము కల్గించుట వలన చేతకి అను సార్ధక నామములు కల్గి ఉన్నది.

Terminalia Chebula Health Benefits

Terminalia Chebula Health Benefits

Also Read: Pests and Diseases in Groundnut: వేరుశనగ తెగుళ్ళు – నివారణ.!

కరకవృక్ష జాతిలోనిది దీని కాయ, పువ్వు, పండు, పిందె చాలా ఉపయోగములు, దీనిలో 5 రుచులు కలవు. ఉప్పు తనము మాత్రము లేదు. నేత్రములకు హితకరం. ఇది గుల్మము, ఆధ్మానము, ప్లీహ, అర్మరోగము, హిక్క శూల, హృద్రోగము, మూత్రకృచ్చము, మూర్ఛఘాతము మొదలగు అనేక వ్యాధుల పైన పనిచేస్తుంది. కరక్కాయను నోటియందుంచుకొని ద్రవము మ్రింగు చుండిన అగ్నిని వృద్ధిని చేస్తుంది. వాత, పిత్తం కఫలమును హరించును.

భోజనం తర్వాత వాడిన త్రిదోషములను నశింప చేస్తుంది. దీనిని బెల్లముతో కలిపి వాడిన అనేక విధములైన వ్యాధులను నశింపజేయును. గర్భవతులు దీనిని ఉపయోగించరాదు. మంచి కరక్కాయ మంచి చర్మము కల్గి, బరువు కల్గి, నీటిలో మునుగును. కరక్కాయ చూర్ణమును తేనెతో వాడిన శ్లేష్మము హరిస్తాయి. కంఠస్వరమును బాగు పరుస్తాయి. త్రిఫల (కరక్కాయ, తానివాయి, ఉసిరికాయ) కషాయము మూత్ర0 జారీ చేస్తాయి. కరక పిందెలను జంగిలీహరదాలు అంటారు. ఈ మసితుడిచి నోటిలో ఉంచుకొని రసము మింగి తే శ్వాస కాస తగ్గుతుంది. కరకవువ్వు చూర్ణము కోరింత దగ్గుల మీద పని చేస్తుంది.

కరక్కాయల చూర్ణముతో పండ్లు తోముట మంచిది. ముఖవ్రణములు, అర్బన్సునందు కరక్కాయ చూర్ణము లేపనం చేసిన గుణo కనిపించును. బెల్లo, నెయ్యి, తేనె, కరక చూర్ణము కలిపి చిరకాల అజీర్ణము నశించి. మంచి ఆకలి కలుగుతుంది. కరక్కాయ చూర్ణo గోమూత్రముతో కలిపి తాగిన కఫము వలన వచ్చిన పాండు రోగo తగ్గుతుంది. దీని చూర్ణo తేనెతో వాడిన వాంతులు తగ్గుతాయి. కారక క్వాధము తేనెతో వాడిన ఆశ్మర వ్యాధి తగ్గును. కరక్కాయ, పిప్పళ్ళు, సమభాగములు అడ్డుసరము రసములో భావన చేయవలెను. తర్వాత దానిని చూర్ణ0 చేసి తేనెతో సేవిస్తే రక్తపిత్త వ్యాధి తగ్గుతుంది. కరక్కాయను తిలతైలముతో వండి శరీరమున మృదువుగా మర్దన చే స్తే కుష్టు రోగము తగ్గుతుంది.చూర్ణము1/2-1 గ్రా.

కరక్కాయలో ఈ క్రింది రసాయనిక పదార్థములున్నాయి:

కాయలో టానిక్ యాసిడ్, గాలిక్ యాసిడ్, చెబులినిక్-యాసిడ్, ముసిలేజ్, గ్లైకోసాయిడ్, కార్బోహైడ్రేట్స్, ఎమినోయాసిడ్స్, ఫాస్పారిన్యాసిద్, సుసినిక్ యాసిడ్లు కలవు. గింజలలో నూనె ఉన్నది.

Also Read: Listeriosis Disease in Goats: మేకలలో లిస్టీరియోసిస్ వ్యాధి వ్యాప్తి చెందు విధానం.!

Leave Your Comments

Pests and Diseases in Groundnut: వేరుశనగ తెగుళ్ళు – నివారణ.!

Previous article

Minister Niranjan Reddy: సాగునీటి రాకతో తెలంగాణ కూలీలంతా రైతులుగా మారారు.!

Next article

You may also like