సాధారణంగా గుండె పోటు అధిక ఒత్తిడికి గురి అయినప్పుడు, ఆందోళనలు కూడా గుండెపోటుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలోనే గుండెపోటును తగ్గించగలిగే మంచి ఔషధాలు ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి ప్రొద్దుతిరుగుడు విత్తనాలు. ఈ విత్తనాలు మన చర్మానికి, ఆరోగ్యానికి, కేశాలకు కూడా మంచి ఔషధంగా పనిచేస్తాయి అని వారు తెలుపుతున్నారు. అయితే ప్రొద్దుతిరుగుడు విత్తనాలు మనకు ఏవిధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
అంతేకాకుండా వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, పాలీ అన్సాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు గుండె జబ్బులు రాకుండా నియంత్రిస్తాయి. అంతేకాకుండా ప్రొద్దుతిరుగుడు విత్తనాలను నిరంతరం తగిన మోతాదులో తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గుతుంది. అలాగే గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్ ఇ, ఫ్లేవనాయిడ్స్, ఇతర వృక్ష సంబంధ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండడం వల్ల వాపులను చాలావరకు నియంత్రిస్తాయి. అంతేకాకుండా ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉన్న వారికి మంచి జరుగుతుంది. ప్రొద్దుతిరుగుడు విత్తనాల్లో మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల ఇది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే మెటబాలిజం ను పెంపొందిస్తుంది. జీర్ణ వ్యవస్థ తో బాధపడేవారు ప్రొద్దుతిరుగుడు విత్తనాలను తింటే ప్రయోజనం చేకూరుతుంది. వీటిలో ఉండే ఎంజైమ్ లు మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వల్ల మహిళల్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు సమతుల్యం గా ఉంటాయి. ఇక థైరాయిడ్ గ్రంధి చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ ప్రొద్దుతిరుగుడు విత్తనాలను తినడం వల్ల శరీరానికి కావలసిన తగిన పోషకాలు అందుతాయి.
ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వలన కలిగే ఆరోగ్య లాభాలు..

Leave Your Comments