ఆరోగ్యం / జీవన విధానం

స్టీవియా ఆకులు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

మనలో చాలా మందికి అనేక ఔషధ మొక్కల గురించి తెలిసే ఉంటుంది. అలాగే ఈ మధ్యన ఔషధ మొక్కల్లో బాగా వినిపిస్తున్న మొక్క పేరు స్టీవియా మొక్క. ఈ మొక్కలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. దీని ప్రత్యేకత చెప్పాలంటే ఈ మొక్క యొక్క ఆకులు తీయదనాన్ని కలిగి ఉంటాయి. దీనికున్న ఈ ప్రత్యేక తీపిదనం వల్ల ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఒక సంజీవనిలాగా ఉపయోగపడుతుంది. అందుకే దీనిని మధుపత్రి, తీపి మొక్క అని కూడా పిలుస్తారు. స్టీవియా మొక్క యొక్క అసలు పేరు స్టీవియా రెబెడియానా. ఇది తులసి జాతికి చెందిన మొక్క. తులసి మొక్కకు ఉన్నట్టే అనేక ఔషధ గుణాలు దీనికి కూడా ఉన్నాయి. ఇంకా ఆరోగ్యపరంగా ఇది మనకు ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం. దీని యొక్క ఆకులు తియ్యగా ఉంటూ పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపిగా ఉంటాయి. అంటే ఒక కప్పు పంచదార స్టీవియా ఆకులతో తీసిన ఒక స్పూను రసానికి సమానం అన్నమాట. స్టీవియా ఆకులను వాడడం వలన ఎటువంటి అదనపు క్యాలరీలు మన శరీరంలోకి చేరవు. అంతేకాకుండా దీని వలన శరీరం యొక్క బరువు తగ్గుతుంది. అది అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. జీర్ణ శక్తిని పెంచి కడుపులో మంట, గ్యాస్ వంటి వాటిని తగ్గిస్తుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉండడం వలన గుండె జబ్బుల నుండి కాపాడుతుంది. ఈ ఆకులు నమలడం వల్ల నోటి దుర్వాసన పోయి దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారికి దీని వలన అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నవి. తీపి పదార్థాలు తిన్న తరువాత స్టీవియా తీసుకుంటే శరీరంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది. అలాగే ఇన్సులిన్ విడుదలలో ప్రధాన పాత్ర పోషించి రక్తంలో గ్లూకోజ్ కూడా అదుపులో ఉంచుతుంది.
మధుమేహం ఉన్నవారు చక్కెరకు ప్రత్యామ్నాయంగా స్టీవియా ఆకుల పొడిని వాడవచ్చు. అంతేకాకుండా ఈ మొక్కలో ఉన్న యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాల వలన చర్మ వ్యాధులను సైతం తగ్గించి, రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇలా ఈ మొక్క ఆకులను నీడలో ఆరబెట్టి పౌడర్ లాగా తయారు చేసుకుని పంచదారకు ప్రత్యామ్నాయంగా టీ కాఫీలలో వాడవచ్చు. కాషాయం రూపంలో గాని లేహ్యంలో రూపంలో గాని వాడవచ్చును. అలాగే పచ్చి ఆకులను కూడా నమిలి తినవచ్చు.అయితే దీనికున్న అత్యంత తీపి గుణం వల్ల అతి కొద్ది మోతాదులో మాత్రమే తీసుకోవాలి.

Leave Your Comments

అరటిలో సస్య రక్షణ చర్యలు ..

Previous article

కరివేపాకు పంట సాగుతో లాభాలు గడిస్తున్న రైతులు..

Next article

You may also like