సగ్గుబియ్యాన్ని చాలామంది తినడానికి ఇష్టపడరు. కానీ సగ్గుబియ్యం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సగ్గుబియ్యంలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉండి, కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు, వారి రోజూ వారీ ఆహారంలో సగ్గుబియ్యం చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక శరీరంలో ఏర్పడిన విష కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికి మాత్రమే కాకుండా పసి పిల్లలకు, చిన్న పిల్లలకు కూడా సగ్గుబియ్యం అమృతంలా పనిచేస్తుంది. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల తర్వాత చిన్న పిల్లలకి తినే ఆహారంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు. సాధారణంగా సగ్గుబియ్యాన్ని పాలతో మాత్రమే కలిపి తీసుకుంటూ ఉంటారు. అంతేకాదు నీటితో కూడా ఉడికించి, ఆ తర్వాత చక్కెర కలిపి తాగడం వల్ల కూడా జీర్ణ సమస్యలు దూరమవుతాయి.
ఒకవేళ విరోచనాలతో బాధపడుతున్నవారు ఈ సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టి, ఆ తరువాత నీటిలో ఉడికించి, కొద్దిగా చక్కెర కలుపుకుని తాగడం వల్ల విరోచనాలు త్వరగా తగ్గడమే కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అలాగే సగ్గుబియ్యాన్ని ఉడికించి తినడం వల్ల శరీరానికి కావలసిన ఫైబర్ అంది జీర్ణక్రియ సమస్యతోపాటు మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటును తగ్గించడంలో మొదటి పాత్ర వహిస్తుంది. ఇక అలాగే వందగ్రాముల సగ్గుబియ్యంతో 20 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీ రోజువారీ కాల్షియం అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. దంతాలు, ఎముకలు పటిష్టంగా తయారయ్యేలా చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి కావలసిన ఐరన్ ను కూడా అందిస్తుంది. రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలను కూడా దూరం చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు వారానికి రెండు సార్లు లేదా కుదిరితే రోజు ఆహారంలో తగు సగ్గుబియ్యాన్ని చేర్చుకోవడం మంచిది.
సగ్గుబియ్యం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments