అరటి పండు అంటే ఇది మామూలు అరటిపండు కాదు.. సాధారణంగా మనం కూర వండుకునే అరటిపండు చూసి ఉంటాం.. పండిన అరటి పండును తిని ఉంటాం.. కానీ ఎర్రటి అరటి పండును ఎప్పుడైనా చూశారా.. మన దేశంలో అరుదు కానీ.. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవును ఎర్రటి అరటి పండు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ అరటిపండు దోహదపడుతుందని తేల్చారు. మరి ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఎర్ర అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. సాధారణంగా ప్రజలు అరటి పండ్లను ఎక్కువగా తింటారు. కారణం అరటిపండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే ఎర్రటి అరటి పండులో అంతకు మించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట అంతేకాదు సాధారణ అరటిపండు కంటే చాలా ఎక్కువ బీటా కెరోటిన్ కలిగి ఉంటుందట. బీటా కెరోటిన్ గుండె ధమనులలో రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎరుపు రంగు అరటిపండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈ అరటిపండు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాదు ఈ అరటిపండు తినడం వల్ల చెస్ట్ అలర్జీని తగ్గిస్తుంది.
ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి. ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దాంతో అతిగా తినడం మానేస్తాం. అంతిమంగా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.
ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా విటమిన్ బి6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది. రక్తహీనత లోపాన్ని అధిగమించడానికి విటమిన్ బి6 సహాయపడుతుంది.
ఎర్ర అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక ఎర్ర అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఆ కారణంగా గుండెపోటు రాకుండా కాపాడుతుంది.
ఎర్ర అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
Leave Your Comments