దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. మరో వైపు ఎండలు ముదురుతున్నాయి. వాతావరణ మార్పుతో పిల్లలు, పెద్దలు, వృద్ధుల్లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు మొదలవుతాయి. ఒంట్లో వేడిమి పెరుగుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలకు మామూలు డైట్ తోపాటు ఒంట్లో వేడిని తగ్గించే పానీయాలను అందించాలి. అలాంటి పానియాల్లో రాగి జావ ఒకటి. కొంత రాగి జావ అంటే ముఖం తిప్పేసుకుంటారు. దానిలో వున్న పోషకాలు తెలుసుకుంటే అస్సలు వదలరు. పైగా ఇండియన్ క్లైమేట్ లో ఇది బాగా పండుతుంది. ఒక్కసారి రాగులు మనకి చేసే మేలు ఏంటో లైఫ్ స్టైల్ లో చూద్దాం.
రాగుల్లో ఉన్న పోషకాలు మెండు. తక్కువ ధరలో, అందరికీ సులభంగా లభించే ఈ రాగులతో ఎన్నో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. వరిలో ఉన్నంత ప్రోటీన్ రాగుల్లో కూడా ఉంటుంది. అయితే ఈ ప్రోటీన్ మిగతా ఆహార పదార్థాల్లో అంతగా లభించదు. ఇది శారీరక ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నన్ని పోషకాలు మిగిలిన ఏ ధాన్యాలలోనూ లేవు. కాబట్టి రోజువారీ ఆహారంలో దీన్ని భాగం చేసుకున్నవారికి పోషకాహారాలేమి అంటూ ఉండదు.
రాగుల్లో మినరల్స్ కూడా ఎక్కువగా వున్నాయి. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5 – 30 శాతం ఎక్కువగా ఉంది. ఇందులో ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాల్షియం సప్లిమెంట్ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారూ, ఆస్టియోపొరాసిస్ వచ్చే అవకాశం ఉన్నవారూ రాగుల్ని తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయస్సు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్ గా తీసుకోవాలి.
మధుమేహ వ్యాప్తి వలన కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోవాలి. ఫైటోకెమికల్స్ వ్యాధుల్ని ఎదుర్కోవడంలోనూ మనకి సాయం చేస్తాయి. అయితే ఇవి ధాన్యపు పైపొరలో ఉంటాయి. కాబట్టి హోల్ గ్రైన్స్ తినడం మంచిది. రాగుల పైపొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలీఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లేసిమిక్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. యాంటీ బాక్టీరీయాల్ గుణాలు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ కీ, టైఫాయిడ్ లాంటి జ్వరానికి, సెల్యులైటిస్ లాంటి స్కిన్ ఇన్ఫెక్షన్ వున్నప్పుడు వీటిని జావలా చేసుకుని తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. చాలా మంది జ్వరంగా ఉన్న సమయంలో మందులు వాడుతుంటారు. అలా కాకుండా దీనిని రెగ్యులర్ గా తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. రాగులు ట్రైగ్లిసరైడ్స్ ఏర్పడకుండా చేసి గుండెజబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి. రాగి మాల్ట్, రాగి లడ్డూ, రాగి హల్వా, రాగి పకోడా, రాగి బిస్కెట్లూ, రాగి దోసె, రాగి సంకటి లాంటివి ట్రై చేసి చూడండి. రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ సెల్ డామేజ్ జరగకుండా చేసి క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. కాబట్టి ముందు నుంచే వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి క్యాన్సర్ కారక సమస్యలు మనదరికి చేరకుండా ఉంటాయి. అంతే కాదండోయ్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా నుండి కాపాడగలం.
రాగి జావ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments