ఆరోగ్యం / జీవన విధానం

గుమ్మడితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

గుమ్మడితో కూర, పులుసు, సూప్ వంటివి చేసుకుంటాం. ఏం వండినా గుమ్మడి రుచికి తిరుగు లేదు. ఇది రుచినే కాదు, ఆరోగ్యాన్నీ ఇస్తుంది.
గుమ్మడి గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని దీనిలోని పీచు, విటమిన్ సి, గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తాయి. పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఎముకల సాంద్రతను ధృడ పరుస్తుంది. గుమ్మడిలోని పోషకాలవల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఇ, బీటా కెరోటిన్లు అధికం. ఇవి కంటిచూపునకు స్పష్టతనిస్తాయి. నేత్ర సంబంధ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. చదువుకునే పిల్లలకు గుమ్మడి వంటకాలు తినిపించడం మంచిది.
తల్లి కావాలనుకుంటున్న వారికి గుమ్మడి ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని ఇనుము సంతాన సాఫల్యతను పెంచుతుంది. విటమిన్ ఏ శరీరంలో బీటా కెరోటిన్ గా మారి హార్మోన్ల అసమతుల్యత రాకుండా చూస్తుంది.
విటమిన్ సి అందించే కూరగాయల్లో గుమ్మడికుడా ఒకటి. ఇది శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల వైరస్ లూ, ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు గుమ్మడి గింజల్ని తినొచ్చు. ఇవి శరీరంలో మేలు చేసే హార్మోన్లను విడుదల చేయడం వల్ల ఒత్తిడి తగ్గి అలసట దూరమవుతుంది. హాయిగా నిద్రపడుతుంది.

Leave Your Comments

రాజస్థాన్ ప్రభుత్వం..ఇంటింటికి ఔషధ మొక్కల పంపిణీ

Previous article

పంట మార్పిడి విధానం పాటించి అధిక లాభాలు ఆర్జిస్తున్నయువరైతు..

Next article

You may also like