వేసవి వచ్చేసింది. మెల్లగా భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. దీంతో ఈ తాపాన్ని తట్టుకోవటానికి శరీరానికి కష్టంగా ఉంటుంది. అందుకనే ఈ సమయంలో మనం తినే ఆహారం శరీరానికి వేసవి తాపాన్ని తగ్గించేవిగా ఉండాలి. ముఖ్యంగా ఈ సీజన్ లో లభించే ఫ్రూట్స్ ను తీసుకోవడం అత్యుత్తమం. శరీరానికి డీహైడ్రేషన్ తగ్గించేది పుచ్చకాయ. అందుకనే దీనిని ఎక్కువగా తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే పుచ్చకాయ కాకుండా ఇంకొకటి కూడా వేసవి తాపాన్ని తీరుస్తుంది, అదే తాటి ముంజు. ఇది డీహైడ్రేషన్, అలసట లేకుండా చేస్తుంది. ఒకప్పుడు ఇవి గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో ఎక్కువగా దొరికేవి. అయితే ఇప్పుడు పట్టణాలలో కూడా కొంతమంది వీటిని అమ్ముతున్నారు. ఈ తాటి ముంజు రుచి, ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయి. వేసవిలో ఎక్కువగా వచ్చే డీహైడ్రేషన్, అలసట, చర్మ సమస్యలతో ఇబ్బందిపడేవారికి తాటి ముంజులు మంచి ఔషధం. అంతేకాదు వీటిల్లో ఎన్నో పోషకాలు వున్నాయి.
మృదువుగా ముట్టుకుంటే జారిపోయేంత సున్నితంగా ఉండే ఈ ముంజులను అలా నోట్లో పెట్టుకుంటే చల్లగా కడుపులోకి జారుకుంటాయి అందుకే వీటిని “ఐస్ యాపిల్స్” అని కూడా అంటారు. ఈ ముంజుల్లో విటమిన్ ఏ, బి, సి, ఐరన్, కాల్షియంతో పాటు,బి కాంప్లెక్స్, నియాసిన్, రిబో ఫ్లేవిస్, దయామిన్, జింక్ ఫాస్ఫరస్, పొటాషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి. కాలేయ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. ముంజుల్లోని పొటాషియం శరీరంలో ఉండే విష పదార్థాలను తొలగిస్తాయి. అయితే లేత తాటిముంజలు తింటుంటే వాటిపై వుండే తొక్కను తొలగించకుండా తినేయండి. అందులో ఎన్నో పోషకాలున్నాయి. శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి ముంజులూ ఎంతో ఉపయోగపడుతాయి. జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్నవారికి ఇవి మేలు చేస్తాయి. ఇక ఇవి బరువును అదుపులో ఉంచుతాయి. పిల్లలకు వృద్ధులకు కూడా అత్యంత మేలు చేస్తాయి ఈ తాటి ముంజులు. వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. దద్దుర్లు, గాయాలు, చెమట కాయలు ఏర్పడినట్లయితే తాటి ముంజుల గుజ్జుని శరీరానికి పట్టించి చూడండి. కొద్ది రోజుల్లోనే తగ్గిపోతాయి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. ఎండల్లో దాహార్తిని తీరుస్తాయి. వడదెబ్బ తగిలినవాళ్లకు ముంజులను జ్యూస్ గా చేసి పట్టిస్తే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
ఆరు అరటిపండ్లలో ఉండే పొటాషియం ఒక్క తాటి ముంజలో ఉంటుందని, ఇవి బీపీని అదుపు చేయడమే కాకుండా కొవ్వును అదుపులో ఉంచుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అలాగే ఎముకలను బలంగా ఉంచేందుకు, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ముంజులు చాలా మంచివట. తాటి ముంజులో స్వచ్ఛమైన, రుచికరమైన నీరు ఉంటుంది. ఆ నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే క్యాన్సర్ కణాల నిరోధకానికి ముంజులు ఉపయోగపడతాయి. రొమ్ము క్యాన్సర్ కు కారణమయ్యే పెట్రో కెమికల్స్, ఎసిడిటి సమస్యలను తాటి ముంజులు దూరం చేస్తాయి.
తాటిముంజుల ఆరోగ్య ప్రయోజనాలు..
Leave Your Comments