Olive Oil Benefits: ఆలివ్ ఆయిల్ చాలా ఏళ్ళ నుండి మన పెద్దలు ఉపయోగిస్తున్నారు. ఆలివ్ నూనెను వాటి పండ్లను పగలగొట్టి దాని గుజ్జు నుంచి తీస్తారు. ఇది ఆరోగ్యపరంగా చాలా మంచిది కావున చాలా ఇళ్ళలో వంట అవసరాల కోసం ఈ నూనెను సాధారణంగా ఉపయోగిస్తారు. దీని తినడం వలన కడుపులో ఉండే చెడు బ్యాక్టీరియాను సైతం ఇది తొలగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇంతెకాదండోయ్!ఆలివ్ ఆయిల్‌ను వాడటం వల్ల క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.
‘ఆలివ్ నూనెలో లభించే ఒమేగా 2 మరియు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఇతర మేలు చేసే పదార్ధాలు ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. చాలా నాటి నుండి ఈ నూనెను ‘లిక్విడ్ గోల్డ్’ అని పిలుస్తారు. ఎందుకనగా దీని వల్ల కలిగే ప్రయోజనాలు అలా ఉన్నాయి మరి! ఈ నూనె కేవలం ఆరోగ్య పరంగానే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా అద్భుతమైన గుణాలు కలిగి ఉండటం వలన చాలా మంది దీనిని వాడుతారు.
Also Read: Agri Horti Pastoral: అగ్రిహోర్టీ-పాస్టోరల్ తో అమరచింత రైతు విజయగాధ.!
ఇందుమూలాన ఆలివ్ ఆయిల్ను మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. స్పెయిన్‌లోని వాలెన్సియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో బార్బా “మన శరీరానికి కావల్సిన అనేక పదార్థాలు ఇందులో ఉన్నాయి’’ అని నిర్ధారించాడు.
సముద్ర ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఆలివ్ నూనెను చాలా విరివిగా వాడతారు. కావున ఈ నూనె మధ్యధరా ప్రాంత ప్రజల ఆహారంలో విడదీయరాని భాగం అని మరియు అనేక పోషక విలువలు కలిగి ఉంటుందని చెప్పుకోవచ్చు. “ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో దొరికే ఆహారాన్ని కాని, పానీయాలను కాని మధ్యధరా సముద్రం చుట్టూ దొరికే వాటితో పోలిస్తే వీళ్ళ ఆహారాలలో గింజలు, పండ్లు, కూరగాయలు పెద్ద పరిమాణంలో ఉంటాయి” అని ప్రొఫెసర్ మార్తా వెల్లడించారు. కావున ఇతర ప్రాంతాలతో పోలిస్తే మధ్యధరా ప్రాంతపు ఆహారాన్ని తినడం వలన మన రక్తంలోని గ్లూకోజ్ పరిమాణం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. చివరకు వర్జిన్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వలన కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని కొందరు నిపుణులు చెబుతున్నారు.
Also Read: Fruit Fly: తీగ జాతి పంటలలో పండు ఈగ సమగ్ర సస్యరక్షణ