ఆరోగ్యం / జీవన విధానం

ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు..

0

ఆవాలను తాలింపు పెట్టేటప్పుడు వేస్తుంటారు. ఆవాలు వేయడం వల్ల కూరలు మంచి సువాసన, రుచి కూడా ఉంటాయి. ఆవాలు తాలింపుకు మాత్రమే కాదు. వీటివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా వున్నాయి. శరీరంపై ఏర్పడే కురుపులకు, దురదలకు ఆవాల పొడిని నీటితో కలిపి కురుపుల పైన రాయడం వల్ల అవి తగ్గిపోతాయి. అంతేకాకుండా ఆవాలు పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి.
పంటి నొప్పితో బాధపడే వాళ్ళు చిటికెడు ఆవాలు తీసుకుని గోరువెచ్చని నీటిలో వేసి ఆ నీటిని నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి సమస్య తగ్గుతుంది. కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్ళకి ఆవాలు మంచి మందులా పనిచేస్తాయి. ఎలాగంటే ఆవాలను, కర్పూరంతో కలిపి ముద్దగా నూరుకోవాలి. ఆ ముద్దను కీళ్లపై రాసుకోవడం వల్ల నొప్పులు తగ్గుతాయి. చర్మంపై ఏర్పడే పులిపిర్లను పోగొట్టుకోవడానికి ఆవాలు మంచి మందులా పనిచేస్తాయి. ఆవాలను పొడిచేసి నీటితో తడిపి పులిపిర్లపై రాయడం వల్ల అవి తగ్గిపోతాయి. ఆవాలులో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం మరియు భాస్వరం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ – ఎ కూడా ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఆవాలు పిండి బాగా పనిచేస్తుంది. ఆవాల పిండిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. వీటివల్ల మధుమేహ రోగులకు బాగా పనిచేస్తుంది. అనారోగ్యాల వల్ల వచ్చే అలసటను, నీరసమును తగ్గిస్తుంది. ఆవ పిండితో చేసిన కాషాయం మౌత్ వాష్ లా పనిచేస్తుంది. అంతేకాకుండా గొంతు నొప్పి తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Leave Your Comments

జెర్బరా పూల సాగు.. ఎంతో లాభం

Previous article

చీడపీడల నుంచి పంటను కాపాడుకునేందుకు కొత్త ఆవిష్కరణ..

Next article

You may also like