ఆరోగ్యం / జీవన విధానం

ఖర్బుజ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

వేసవి రానే వచ్చింది. మార్చి మొదట్లోనే ఎండలు ఓ రేంజ్ లో మండిపోతున్నాయి. అయితే సమ్మర్ వస్తు వస్తూనే కొన్ని పండ్లను తన వెంట తీసుకొస్తుంది. అలాంటి వాటిలో ఖర్బుజ ఒకటి. సాధారణంగా సమ్మర్ లో రోడ్డుపై ఎక్కడ చూసినా ఖర్బుజ పండ్లు, జ్యూస్ సెంటర్లు కనిపిస్తుంటాయి. మరి వేసవిలో విరివిగా లభించే ఖర్బుజతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి తెలుసుకుందాం.. ఖర్బుజ లో విటమిన్ కె, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. సంతాన లేమితో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలకపాత్ర పోషిస్తుంది.
ఇక ఇందులో ఉండే బీటాకెరోటిన్ క్యాన్సర్ కణాలను తొలగించి ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. తెల్ల రక్త కణాల వృద్ధిలో కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి ఖర్బుజ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు ఖర్బుజ జ్యూస్ తాగడం మంచిది. ఖర్బుజలో ఉండే విటమిన్ – ఎ కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపు మెరుగుపరడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండులో ఉండే పొటిషం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్ అందుతాయి. గుండె పోతూ సమస్యను దూరం చేయడంలో ఖర్బుజ ఉపయోగపడుతుంది. కిడ్నీ లో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఖర్బుజ ను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కరిగిపోతాయి. ఇక ఈ పండులో ఉండే పీచు వల్ల శక్తి మెరుగుపడుతుంది. ఫైల్స్ వంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

Leave Your Comments

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.1,500 కోట్లు బడ్జెట్ కేటాయింపు..

Previous article

సమగ్ర వ్యవసాయంలో అధిక లాభాలు ఆర్జిస్తున్న యువరైతు..

Next article

You may also like