ఆరోగ్యం / జీవన విధానం

మునగాకు తినడం వలన కలిగే ప్రయోజనాలు..

0

మునక్కాయలంటే వారంలో ఏదో ఒకరోజు మనం తినే ఆహారమే కదా అనుకోకండి. దాదాపు మూడొందలకు పైగా వ్యాధులను నయం చేసే శక్తి మనగాకుకు ఉందట. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో మునగకాయలు కీలక పాత్ర పోషిస్తాయట. శృంగారపరంగా ఎదురయ్యే సమస్యలకు మునగ దివ్య ఔషధం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మునగాకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లలో ఉండే విటమిన్ ఏ మునగాకులో పదిరెట్లు ఉంటుంది. కళ్ళ వ్యాధులకు సంబంధించిన ఔషధాల తయారీలో మునగాకును ఉపయోగిస్తారని చాలామందికి తెలియదు. పాలు తాగమని చాలామంది చెబుతుంటారు. పాలలో వుండే కాల్షియం ఆరోగ్యకరమని అలా చెబుతుంటారు. కానీ అదే కాల్షియం మనగాకులో పాలలో ఉండే దాని కంటే 15 రెట్లు అధికంగా ఉంటుందట. పెరుగులో ఉండే ప్రొటీన్ల కంటే మునగలో ఉండే ప్రొటీన్లే ఎక్కువట. అరటి పండులో దొరికే పొటాషియం మునగాకులో ఇంకా ఎక్కువ దొరుకుతుంది. మునగాకును ఉడికించి రసాన్ని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ సజావుగా జరిగి మలబద్దకం వంటి సమస్యలు పరిష్కారమవుతాయి. మునగాకు పొద్దునే 3 నెలల పాటు డైలీ తీసుకుంటే 13.5 శాతం షుగర్ లెవల్స్ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. ఐదు రకాల క్యాన్సర్లను నివారించే శక్తి మునగలో ఉంది. లంగ్, లివర్, ఒవేరియన్, మెలనోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఉందని వెల్లడైంది. గుప్పెడు మునగాకులను వంద మిల్లీ లీటర్ల నీటిలో వేసి ఐదు నిమిషాలు ఆ నీటిని కాచి చల్లారనివ్వాలి. ఆ నీటిలో కొంచెం ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలిపి తాగితే ఆస్తమా, టీబీ, దగ్గు తగ్గుతాయి. మునగాకు రసం ఒక చెమ్చా తీసుకుని దాన్ని గ్లాసు కొబ్బరినీళ్లలో కలిపి కాస్తంత తేనె కలిపి ఇస్తే విరోచనాలు తగ్గిపోతాయి.
మునగాకు రసానికి నిమ్మరసాన్ని కలిపి ముఖానికి రాస్తే మొటిమలు, బ్లాక్ హెడ్స్ పోతాయట. వంద గ్రాముల మునగాకులో నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రాములు, కొవ్వు 17 గ్రాములు, మాంసకృతులు 6.7 గ్రాములు, సి విటమిన్ – 200 మిల్లీ గ్రాములు, ఎనర్జీ 97 కేలరీలు, కాల్షియం 440 మిల్లీ గ్రాములు, ఫాస్ఫరస్ 70మిల్లీ గ్రాములు, ఐరన్ 7 మిల్లీ గ్రాములు ఉంటాయి.

Leave Your Comments

“రౌండ్ చిల్లి” ప్రపంచంలోనే ఘాటైన మిరపకాయలలో.. ఒకటి

Previous article

వ్యవసాయంలో నూతన ఒరవడిని సృష్టిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి..

Next article

You may also like