Millets Health Benefits: ప్రతి ఒక్కరు చిరుధాన్యాలు గురించి, వాటి అవ్యశకత గురించి తెలుసుకోవాలిసిన అవసరం ఎంతైనా ఉంది. రోజురోజుకు మన ఆహరపు అలవాట్లు మారుతున్న దృష్టా అనార్యోగం పాలవుతున్నాము. చిరు ధాన్యాలను చాల మంది అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. కానీ ఆరోగ్యంగా వున్నవాళ్లు కూడా తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవారు వీటిని తీసుకోవడం వలన ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా చక్కగా ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్థాయి. ప్రతిరోజు ఏదో ఒక చిరు ధాన్యాన్ని మన ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి చాల మంచిది మరియు అన్ని రకాల పోషక విలువలు మన శరీరానికి అందుతాయి.
రాగులు, కొఱ్ఱలు, జొన్నలు, సజ్జలు, సామలు, అరికెలు మరియు ఉధలు అన్నింటినీ కలిపి సిరిధాన్యాలు అంటారు. ఇవి సన్నగా ఉండే గడ్డి లాంటి మొక్కల ద్వారా పెరుగుతాయి. వీటిని మనం ఆహారంలో భాగంగా చేసుకోవడం, మరియు వీటితో ఆహారపదార్థాలను తీసుకోవడం వలన మనం పూర్తి ఆరోగ్యంగా బలంగా ఉండవచ్చు. కానీ రోజురోజుకు ఈపంటలు వేయడంలో రైతులు కనుమరుగు ఆవుతున్నారు. దానికి కారణం ఆపంటలు గురించి తెలియక పోవడమే. ఈరోజు మనం ఏరువాకలో చిరుధాన్యాల పంటలు గురించి తెలుసుకుందాం
చిరుధాన్యాలకు మార్కెట్లో గిరాకీ
అన్ని రకాల చిరుధాన్యాలలో మన శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు సమృద్ధిగా ఉండడం వలన వీటి సాగు ఆవశ్యకత రోజురోజుకూ పెరుగుతోంది. చిరుధాన్యాలు మొట్టపంటలలో అతి ముఖ్యమైన పంట. ఇది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఈపంటను సాగుచేస్తారు.. అంతేకాకుండా ఆదాయానికి, పశుగ్రాసానికి కూడా ఉపయోగపడుతుంది.. చిరుధాన్యాలను రెండు కాలలలో పండిస్తారు. ఇది ఎక్కువగా తెలంగాణలో పండిస్తారు. ఆంద్రప్రదేశ్ లో ఈపంటల గురించి రైతులకు చెప్పవలిసిన అవశ్యకత ప్రభుత్వానికి ఎంతైన ఉంది..
Also Read: Organic Farming: వలస కూలీల జీవితాల్లో ‘జ్యోతి’
తేలికపాటి నేలలు ఉంటే చాలు
ప్రస్తుతం చిరుధాన్యాల వినియోగం దేశంలో ఎక్కువగా ఉండడంతో మార్కెట్లో గిరాకీ ఏర్పడింది. దీంతో చిరుధాన్యాలను సాగు చేస్తున్న రైతులకు లాభాల పంట పండిస్తోంది. రాగులు, కొఱ్ఱలు, జొన్నలు, సజ్జలు, సామలు, అరికెలు ఉధలు వీటిని జూన్ రెండవ వారం నుండి జులై రెండవ వారం వరకు విత్తుకోవచ్చు. తేలిక పాటి నేలల నుండి మధ్య రకం నేలలో ఈపంటను సాగుచేసుకోవచ్చు. వీటిలో అధిక దిగుబడినిచ్చే రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.
చీడపీడల నుంచి పంటల సంరక్షణ
జనాభా పెరుగుతున్న కొద్దీ అధికంగా ఆహరం ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీనితో అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు, చీడపీడల నుంచి పంటల సంరక్షణ కోసం పురుగు, తెగుళ్ల మందుల వాడకం ప్రారంభమైంది. వీటి వాడకంలో విచక్షణ లోపించటంతో సమస్యలు ప్రారంభమయ్యాయి. పర్యావరణం విషతుల్యం కావటం ప్రారంభమైంది. సజ్జలు, రాగులు, కొర్రలు, ఊదలలో మాంసకృతులు ఎక్కువగా ఉంటాయి.
చిరుధాన్యాలను పప్పులతో, మంసములలో, అకుకురలతో కలిపి తినడం వలన మానవులతో పెరుగుదల, పాలలో ఉండే మంసకృత్తులతో సమానంగా ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన మాంసకృత్తులు సరైన పాళ్లలో అందుతాయి. ఆహార ధాన్యాలతో పోల్చినపుడు చిరుధన్యాలలో ముఖ్యంగా సజ్జలలో అధిక శాతం కొవ్వు పదార్ధాలు ఉన్నాయి. వీటిని మనం ఆహరంగా తీసుకోవడం ద్వారా ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చ 2023ను మిల్లట్ డే గా కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా ఎన్నో సబ్సిడిలను కూడా అందజేస్తుంది. వర్షాకాలంలోను కూడా తట్టుకునే పంట ఏదైనా ఉంటే అది చిరుధాన్యాల పంట.
Also Read: Chilli Exports: మిర్చి అ’దర’హో ఈఏడాది ఎగుమతులు పదివేల కోట్లు.!