Makhana Health Benefits: ఈ మధ్య కాలంలో మఖానా అనే పేరు మార్కెట్లో చాలా వింటున్నాము. మఖానా అంటే తామర గింజలు. ఈ తామర గింజలు అలానే తింటారు కానీ వీటిని పోర్క్స్ చేసి మఖానా అనే పేరుతో మార్కెట్లో అమ్ముతున్నారు. ఈ మఖానాకి మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉంది అంటే ఈ మఖానాలో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మఖానా తిన్నడం వల్ల మంచి పోషక విలువలతో పాటు రోగాలని కూడా తగ్గించుకోవచ్చు.
మఖానాలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ప్రొటీన్లు, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, మెగ్నీషియం ఎక్కువగా ఉన్నాయి. కొలెస్ట్రాల్, సోడియం తక్కువ శాతంలో ఉండటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ఈ ఫూల్ మఖానాతో గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్, ఆర్థరైటిస్ రోగాల నుంచి బయటపడవచ్చు.
ఈ ఫూల్ మఖానాలో గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం తక్కువగా ఉంటుంది. దానితో రక్తంలో చెక్కర శాతాన్ని తగ్గిస్తుంది. ఈ ఫూల్ మఖానాతో కూరలు, ఖీర్, స్వీట్స్ తయారు చేసుకోవచ్చు.
Also Read: Integrated Farming System Profits: పాడిపంటల సమూహమే ‘వ్యవసాయం’
సోడియం శాతం తక్కువ ఉండి, పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల హైపర్‌టెన్షన్, బీపీ తగ్గుతుంది. సోడియం తక్కువ ఉండటంతో రక్తపోటు రాకుండ జాగ్రత్త పడవచ్చు. మెగ్నీషియం ఉండటం వల్ల రక్తం, ఆక్సిజన్ నాణ్యతను పెంచుతుంది. ప్రోటిన్, ఫైబర్ శాతం ఎక్కువ, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో మఖానా తిన్నడం మంచిది.
మఖానాలో క్యాల్షియం, మెగ్నీషియం శాతం ఎక్కువ ఉంటుంది. దాని వల్ల కీళ్ల, ఎముకలు, దంతాలను బలంగా చేస్తుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్ ఉండటం వల్ల చిగుళ్ల సమస్యలు కూడా తగ్గిస్తాయి. ప్రతి రోజు 4-5 మఖానాలు తింటే ఆరోగ్యంగా ఉంటాము కానీ 25-30 గ్రాముల కంటే ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిది కాదు.
Also Read: Goldenrod: ‘బంగారు కడ్డి’ పువ్వుల సాగు