మనకి మొక్కజొన్న విరివిగా దొరుకుతూనే ఉంటుంది. కేవలం మనదేశంలోనే కాదు చాలా దేశాల్లో మొక్కజొన్నలని ఉపయోగిస్తారు. ఇది మంచి ఆహార ధాన్యం. మొక్కజొన్నని ఉడకబెట్టుకుని తిన్న, కాల్చుకునైనా తినొచ్చు. దీని గింజల నుంచి పేలాలు, పాప్ కార్న్, కార్న్‌ఫ్లేక్స్ లాంటివి తయారుచేస్తారు. అలాగే బేబీ కార్న్ ని వంటల్లో ఉపయోగిస్తుంటారు. ఎలా చేసుకున్న మంచి రుచి ఆరోగ్యం కలుగుతుంది. దీనిలో విటమిన్ బి1, విటమిన్ బి6, ఫాలో యాసిడ్ కూడా ఉంటాయి. విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అలానే మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.
మనకి కావాల్సిన లవణాలు లేదా మినరల్స్ ఇందులో ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఇందులో ఉండటం వల్ల ఎముకలు గట్టి పడేలా చేస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని విత్తనాల నూనె చర్మానికి రాస్తే చర్మంపై ఏర్పడే మంటలు కూడా తగ్గుతాయి.
మొక్కజొన్న వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Leave Your Comments