ఆరోగ్యం / జీవన విధానం

కివి పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

కివి పండ్లను మనదేశంలో చాలా తక్కువగా పండిస్తారు. ఈ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది. ధర కూడా ఎక్కువగానే ఉంటుంది. మన దేశంలో తక్కువ పండుతాయి. కానీ అన్ని పట్టణాల్లోనూ అమ్ముతున్నారు. కివి పండులో మనకు కావలసిన పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే కివి పండు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కివి పండులో విటమిన్ ఈ, విటమిన్ సి, అధికంగా ఉండటమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇవి మన శరీరానికి చాలా ఉపయోగపడతాయి. కివి పండు తిన్న లేదా వాటిని జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల పొటాషియం, ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థాలు, ఇవన్నీ శరీరానికి అందుతాయి. ఇవే కాకుండా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆహారం సక్రమంగా జీర్ణం కావడానికి కివి పండ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదర సమస్యలను నివారిస్తుంది. అంతే కాకుండా ఈ పండ్లు తీసుకోవడం వల్ల ఆహారం బాగా జీర్ణం అవుతుంది. రోగనిరోధక శక్తి పెరగడానికి కివి పండ్లు తీసుకోవడం మంచిది. వేసవికాలంలో ఈ పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కివి పండులో వుండే ఫైబర్ నిద్రలేమి సమస్యను చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడే వారిలో కివి పండ్లను తీసుకోవడం మంచిది. కివి పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా, వాటి తొక్కల్లో కంటి చూపు మెరుగుపడటానికి మెరుగు పడడానికి కావలసిన లూయిటిన్ అనే పదార్థము ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు కివి పండ్లను తీసుకోవడం మంచిది. కివి పండ్లలో కొవ్వు శాతం, సల్ఫర్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు, గుండె సంబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. కివి జ్యూస్ తాగడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. కివి పండ్లు తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది. అలాగే రక్తనాళాల్లో గట్టి పదార్థం ఏర్పడకుండా కాపాడుతుంది. గుండెకు రక్తం సరఫరా చేయడానికి కివి పండ్లు దోహదపడతాయి.

Leave Your Comments

వ్యవసాయ పద్దుపై శాసనసభలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Previous article

అర్బన్ పార్కుల్లో శ్రీగంధ సువాసనలు..

Next article

You may also like