ఆరోగ్యం / జీవన విధానం

నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు..

0

మన పల్లెటూళ్లలో చెరువు గట్టున లేదా పొలాల గట్టున ఉండే నేరేడు చెట్టు దాదాపు అందరికీ సుపరిచితమే. దాని నుండి వచ్చే పండు నేరేడు పండు. పట్టణ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా కనబడతాయి. అందరికీ అందుబాటులో ఉండే నల్లగా నిగనిగగా మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే ఆల్ల నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సంవత్సరం పొడవునా దొరికే నేరేడు ఆరోగ్యానికి అమృతం వంటిది.
నేరేడుపండులో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ సి, ఏ తో పాటు రైబోఫ్లేవిన్, పోలిక్ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి.
మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్దీకరించబడుతుంది. తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్టు బెరడు కూడా ఔషధాల తయారీలో వాడుతారు. ఈ అల్లనేరేడు చెట్టు కాయల నుండి వెనిగర్ ను తయారు చేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగుపరుచుకోవాలంటే నేరేడు పండ్లు తినమని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరు ను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రక్తంలో క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్ళను బలంగా చేయడంతో పాటు నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. నేరేడు గింజల పొడి ముఖానికి ప్యాక్ గా వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా ఈ నేరేడు పండు పురుషుల్లో శృంగార శక్తిని పెంచుతుంది. నేరేడు పండును మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్ధకంతో పాటు మూత్ర సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఆస్తమా మరియు ఊపిరిత్తితుల సమస్యలను దూరం చేస్తుంది. అనేక చర్మ వ్యాధులను, చర్మంపై వచ్చే తెల్లటి మచ్చలను తగ్గించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కీళ్లనొప్పులను మరియు లివర్ సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది. శరీరానికి ఆరోగ్యాన్నిచ్చే ఆరోగ్యప్రదాయిని అల్లనేరేడు పండు దొరికే సీజన్ లో రెగ్యులర్ గా తీసుకోవడానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.

Leave Your Comments

మొక్కజొన్నలో కత్తెర పురుగు – సమగ్ర సస్యరక్షణ

Previous article

భూసార పరీక్షలు ఇక నుంచి రైతు వేదికల్లో ..

Next article

You may also like