వేసవిలో విరివిగా దొరికే పండ్లలో పనస పండు ఒకటి. భారీ పరిమాణంతో ఉండే పండు చూడ్డానికి వింతగా కనిపించినా అందులోని పనస తొనలు నోరూరిస్తాయి. ఈ తొనలు కేవలం రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. అందుకే పనసపండును ఆయుర్వేదంలో ఔషధ గని అని పిలుస్తారు. పనసపండు తినడం వల్ల శరీరానికి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు అందుతాయి. పనసలో ఫైబర్, విటమిన్ – సి, విటమిన్ – ఎ, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, భాస్వరం, కాల్షియం కూడా ఉంటాయి. ఇది బీటా కెరోటిన్, లుటీన్ గణనీయమైన యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంది. అయితే వీటిన్నింటికన్నా ఎక్కువ.. ఈ పనసపండు ప్రత్యేకత ఏంటంటే ఇందులో గణనీయమైన మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది.
పనసపండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ సంరక్షణ మెరుగవుతుంది,బరువు తగ్గుతారు, జీర్ణక్రియ బాగుంటుంది, శక్తిని పెంచుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శ్వాసకోశ ఆరోగ్యం మెరుగ్గా పనిచేస్తుంది, రక్తపోటు తగ్గుతుంది, నిద్రను ప్రేరేపిస్తుంది.
పనస పండు తింటే కలిగే లాభాలు..
Leave Your Comments