Health Benefits of Honey: తేనే తీసుకునే విధానం బట్టి వివిధ రకాలుగా శరీరంపై ప్రభావాన్ని చూపుతుంది. తేనేను గోరు వెచ్చని నీటితో కలిపి త్రాగితే, అది రక్తంలోని ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడంలో ఎంతో ఉపయోగపడుతుంది. శరీరంలోని వివిధ భాగాలకు రక్తంలో ఆక్సిజన్ అందచేయడంలో ఈఆర్బిసి లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. తేనెను గోరువెచ్చని నీటితో కలిపి త్రాగడం వల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి, రక్త హీనత నుంచి ఉపశమనం కలుగుతుంది. మనం తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించడం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. ఇందువల్ల శరీర భాగాలకు ఆక్సిజన్ అందజేసే సామర్థ్యం రక్తంలో తగ్గుతుంది. దీంతో అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మాంద్యం వంటి సమస్యలు వస్తాయి. తేనె రక్తానికి ఆక్సిజన్ అందజేసే సామర్థ్యాన్ని పెంచడం ద్వారా పై సమస్యలను నివారిస్తుంది.
రక్తంలో ఆక్సిజన్ స్థాయిని పెంచడం అనేది చాలా ముఖ్యమైంది ఎందుకంటే శరీరం ఎంత ఆరోగ్యంగా వుంది, ఎంత సులభంగా శక్తిని తిరిగి పొందుతోంది. అనేవి రక్తంలో ఆక్సిజన్ స్థాయిపై ఆధారపడి వుంటాయి. ప్రాథమిక వైద్య పరిశోధనలో సైతం తేనె వాడకం వల్ల రక్తపోటు, హైపర్టెన్షన్ పై మంచి ప్రభావాన్ని చూపుతాయని తెలుసుకున్నారు. సాధారణంగా, తేనెను త్రాగడం వల్ల హైపర్టెన్షన్ లేదా లో-బిపి యొక్క ప్రభావం గణనీయంగా తగ్గుతాయి. తేనె వాడకం వల్ల కిమోథెరపీ రోగులలో తక్కువగా వున్న తెల్ల రక్త కణాల సంఖ్యను నియంత్రిస్తాయని మరికొన్ని ప్రాధమిక ఆధారాల వల్ల రుజువైంది. చిన్న పాటి ప్రయోగాలలో, కిమోథెరపీలో భాగంగా 400 మంది రోగులు రోజుకు రెండు చెంచాల తేనెను తీసుకోవడం వల్ల ప్రమాదకర స్థాయిలో తక్కువగా ఉన్న తెల్ల రక్త కణాల సంఖ్య నియంత్రించబడి, ఆ సమస్య తిరిగి పునరావృతం కాకుండా నివారించబడింది.
చక్కెరకు ప్రత్యామ్నాయం (Substitute Honey for Sugar)
చక్కెర వాడటం వల్ల శరీరంపై చెడు ప్రభావం కలుగుతుందని చాలా మంది చెబుతారు. ఇందుకు తేని గొప్ప ప్రత్యామ్నాయం ఎందుకంటే అది తీయగా వుంటుంది అలాగే అది తీసుకోవడం శరీరానికి సురక్షితం. తేనె రసాయన తయారీలో భాగంగా కొంత చక్కెర లక్షణాలు కలిసినప్పటికీ, అది చక్కెర కంటే ఎంతో భిన్నమైంది. ఎందుకంటే ఇందులో 30 గ్లూకోస్, 40% ఫ్రట్టోస్ – (రెండు సింపుల్ షుగర్) – అలాగే 20% ఇతర సంక్లిష్టమైన చక్కెర లక్షణాలను కలగలిపి వుంటాయి. తేనెలో ఇంకా డెస్క్రీన్, స్టార్చీ, ఫైబర్ కూడా వుంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిని సాధారణంగా ఉంచడంలో ఈ మిశ్రమం సహాయపడుతుంది.
Also Read: టన్నెల్ ఫార్మింగ్ తో రైతులకి అదిరే రాబడి.!
యోగ సాధన చేసే వారు తేని వాడటం వల్ల రక్తంలోని రసాయనంలో సమతుల్యత వస్తుంది. తేనెను రోజూ తీసుకోవడం వల్ల శరీర వ్యవస్థ మరింత శక్తివంతం అవుతుంది. ప్రొద్దున యోగ సాధనకు ముందు గోరువెచ్చని నీటితో తేనెను కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని అన్ని వ్యవస్థలు బాగా తెరుచుకుంటాయి.
Also Read: ఆంతురియం పూల సాగులో మెళకువలు